iDreamPost
android-app
ios-app

YVS చౌదరి భార్య గురించి తెలుసా..? ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే?

  • Published Jun 10, 2024 | 6:28 PM Updated Updated Jun 10, 2024 | 6:28 PM

YVS Chowdary: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తర్వాత వరుస ఫ్లాపులతో దాదాపు పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు.

YVS Chowdary: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తర్వాత వరుస ఫ్లాపులతో దాదాపు పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు.

  • Published Jun 10, 2024 | 6:28 PMUpdated Jun 10, 2024 | 6:28 PM
YVS చౌదరి భార్య గురించి తెలుసా..? ఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే?

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకులు తర్వాత వరుస అపజయాలతో సతమతమై ఇండస్ట్రీకి దూరమైన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో వైవీఎస్ చౌదరి ఒకరు.  ఇండస్ట్రీలో ఒకప్పుడు వైవీఎస్ చౌదరి పేరు మారు మోగేది.. రచయిత, దర్శకుడు, నిర్మాత, ఎగ్జిబీటర్, ఆడియో కంపెనీ అధినేత గా కొనసాగారు. 1998 లో నాగార్జున నిర్మాణంలో గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రూపొందించిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ’ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఆమె ఎవరూ? ఏ సినిమాల్లో నటించింది? అన్న విషయం గురించి తెలుసుకుందాం.

వైవీఎస్ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ’ సూపర్ హిట్ తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహంచారు.మంచి హిట్స్ అందించిన చౌదరి తర్వాత ఫ్లాపులతో సతమతమయ్యాడు. దాదాపు పదేళ్ల తర్వాత నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వైవీఎస్ చౌదరి సతీమణి గీత సందడి చేశారు. గీత గతంలో పలు చిత్రాల్లో నటించింది.

కింగ్ నాగార్జున నటించి సూపర్ హిట్ మూవీ ‘నిన్నే పెళ్లాడుతా’ మూవీలో ఆయన చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత మాస్ మహరాజ నటించిన సింధూరం మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు చిత్రల్లో క్యారెక్టర్ పాత్రలలో నటించి మెప్పించింది. నిన్నె పెళ్లాడుతా మూవీ సమయంలో వైవీఎస్ చౌదరి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసేవారు.. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.. ఇద్దరి కులాలు వేర కావడంతో పెద్దలు అభ్యంతరం చెప్పినా.. వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss