బిగ్ బాస్ కంటెస్టెంట్లని టార్గెట్ చేసిన యువసామ్రాట్.. వాళ్ళని జైలుకు పంపితేనే!

Yuvasamrat Targets Bigg Boss Contestants: హర్ష సాయి గురించి తెలిసిన వాళ్లకి యువసామ్రాట్ గురించి తెలియకుండా ఉండదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హర్ష సాయిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ చాలా మందిని ఆర్థికంగా నష్టపరుస్తున్నారని యువసామ్రాట్ కామెంట్స్ చేశారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లని టార్గెట్ చేశారు. వాళ్ళని జైలుకు పంపితేనే ఈ బెట్టింగ్ యాప్ దుర్మార్గాలు ఆగుతాయని అన్నారు. 

Yuvasamrat Targets Bigg Boss Contestants: హర్ష సాయి గురించి తెలిసిన వాళ్లకి యువసామ్రాట్ గురించి తెలియకుండా ఉండదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హర్ష సాయిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ చాలా మందిని ఆర్థికంగా నష్టపరుస్తున్నారని యువసామ్రాట్ కామెంట్స్ చేశారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లని టార్గెట్ చేశారు. వాళ్ళని జైలుకు పంపితేనే ఈ బెట్టింగ్ యాప్ దుర్మార్గాలు ఆగుతాయని అన్నారు. 

హర్ష సాయి, యువసామ్రాట్, బెట్టింగ్ యాప్స్.. గత కొన్ని రోజుల నుంచి ఇదే రచ్చ నడుస్తోంది. యువసామ్రాట్ గురించి హర్ష సాయి తీవ్రమైన ఆరోపణలు చేయడం.. ఆధారాలు ఉన్నాయని అనడం.. ఆ తర్వాత హర్ష సాయి తనని డిఫెన్స్ చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేయడం చూశాం. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లని టార్గెట్ చేశారు యువసామ్రాట్ రవి. బిగ్ బాస్ కంటెస్టెంట్లు కొంతమంది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని.. అది చాలా పాపం అని అన్నారు. ఈ బెట్టింగ్ దుర్మార్గాలు ఆగాలంటే వాళ్ళని జైలుకు పంపించాల్సిందే అని.. అప్పుడే వీళ్లకు బుద్ధి వస్తుందని కామెంట్స్ చేశారు. 

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువసామ్రాట్.. బిగ్ బాస్ కంటెస్టెంట్లని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఏమీ సుద్ధపూసలు కాదని.. వాళ్ళు కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ వారానికి లక్షల్లో సంపాదించుకుంటున్నారని.. అయితే హర్ష సాయి లాంటి వాళ్ళు చేసే దాంతో పోలిస్తే చిన్నదే అని అన్నారు. అయినప్పటికీ అది పాపమే అని అన్నారు. హర్ష సాయి పెద్ద ఫిష్ అయితే.. వీళ్ళు స్మాల్ ఫిషెస్ అని కామెంట్స్ చేశారు. ముందు హర్ష సాయి లాంటి పెద్ద చేపలను జైలుకు పంపించేస్తే ఆ తర్వాత చిన్న చేపలకు ఆటోమేటిక్ గా వెన్నులో వణుకు వస్తుందని.. చట్టమంటే భయం, గౌరవం ఏర్పడతాయని కామెంట్స్ చేశారు. చట్టం ప్రకారం జూదం అనేది నేరం. ఈ నేరం చేసే ప్రతి ఒక్క నేరస్తులను జైల్లో వేయాలని కోరుకుంటున్నా అని అన్నారు.

బెట్టింగ్ యాప్స్ ని టిక్ టాక్ యాప్ లా పూర్తిగా బ్యాన్ చేసే అధికారం మన రాజకీయ నాయకులకు లేదని.. ఆ పవర్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే చర్యలు తీసుకోవచ్చునని అన్నారు. ఇదంతా ఇంటర్నెట్ లో చీకటి ప్రపంచంలో జరుగుతుంది కాబట్టి.. ప్రతీ వారానికొకసారి మానిటరింగ్ చేస్తూ ఒక్కో సైట్ ని ఏరిపారేయాలని.. బెట్టింగ్ యాప్ ల గురించి సమాచారం ఇచ్చిన వారికి ప్రైజ్ మనీ ఇస్తే ఈ యాప్స్ ని పూర్తిగా బ్యాన్ అవుతాయని అన్నారు. కాగా యువసామ్రాట్ పై నటరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన యువసామ్రాట్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లపై యువసామ్రాట్ చేసిన ఆరోపణల కారణంగానే నటరాజ్ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి యువసామ్రాట్ రవి బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఉద్దేశించి చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments