iDreamPost
android-app
ios-app

Yatra 2: యాత్ర 2లో YSR డైరీ.. అందులో ఏముందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

  • Published Jan 05, 2024 | 2:30 PM Updated Updated Jan 05, 2024 | 2:30 PM

Yatra 2 Teaser: యాత్ర 2 టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే టీజర్ లో వైఎస్సార్ కి సంబంధించిన డైరీ ఒకటి ఉంటుంది. అది గమనిస్తే ఖచ్చితంగా మీరు వైఎస్సార్ అభిమానులు అయితే కనుక కన్నీళ్లు పెట్టుకుంటారు. అందులో ఏముందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

Yatra 2 Teaser: యాత్ర 2 టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే టీజర్ లో వైఎస్సార్ కి సంబంధించిన డైరీ ఒకటి ఉంటుంది. అది గమనిస్తే ఖచ్చితంగా మీరు వైఎస్సార్ అభిమానులు అయితే కనుక కన్నీళ్లు పెట్టుకుంటారు. అందులో ఏముందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

Yatra 2: యాత్ర 2లో YSR డైరీ.. అందులో ఏముందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

వైఎస్సార్ ఈ పేరుకి ఒక చరిత్ర ఉంది. తన మాటలతో, తన చేతలతో ప్రతిపక్షాల నుంచి ప్రజల వరకూ అందరి మనసులు గెలుచుకున్న మహానాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీర్తి సంపాదించుకున్నారు. అయితే ప్రతిపక్షాల కంటే ప్రమాదకరమైన వ్యాధి ఒకటి ఉంటుంది అదే పగ. అదున్న వారు మంచి వారిని కూడా జనం నుంచి దూరం చేయాలనుకుని కుట్రలు పన్నుతారు. ఇది అందరికీ తెలిసిందే. ఇలాంటి వారిని మినహాయిస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కోట్ల మంది మనసులను గెలుచుకున్నారు. అలాంటి ఆయన జీవిత కథ ఆధారంగా ఇప్పటికే యాత్ర సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

ఇప్పుడు యాత్ర 2 పేరుతో మరో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ.. యాత్ర 2ని అంతకు మించిన కంటెంట్ తో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తేనే అర్ధమవుతోంది. వైఎస్సార్‌ మరణం తర్వాత చోటుచేసుకున్న సంఘటనలు.. ప్రజా సంకల్ప యాత్ర.. 2019 ఎన్నికల్లో సంచలన విజయం వంటి ఎలిమెంట్స్ తో చిత్రాన్ని తెరకెక్కించారు.

అయితే యాత్ర 2 టీజర్ సరిగ్గా గమనిస్తే.. ఒక నిమిషం 40 సెకండ్ల దగ్గర ఒక చిన్న పాకెట్ డైరీ ఉంటుంది. అందులో.. ‘ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి.. కేంద్ర నిధులు రావాలి’ అని రాసి ఉంటుంది. ఇది చూసినప్పుడు ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లుతాయి. డైరీ చాలా మంది రాసుకుంటారు. అందులో తాము చేసే పనులు తప్ప వేరే ఏమీ ఉండవు. కొంతమంది గోల్స్ రాసుకుంటారు. అవి కూడా కారు కొనాలనో, ఇల్లు కొనాలనో ఇలాంటివి ఉంటాయి. కానీ ప్రజలకు మేలు చేయాలి అని ఎవరూ రాసుకోరు. ఒకవేళ ఉంటే ఉండవచ్చు గాక. కానీ రాజకీయాల్లో అలాంటి మంచి మనుషులు ఉన్నారంటే మహనీయులని అర్థం. ఆ డైరీలో ఆరోగ్య శ్రీ బీమా ఇవ్వాలి అని రాసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది తన అంతిమ లక్ష్యం, జీవిత ధ్యేయం అయితే తప్ప అలా రాసుకోరు.

ఆ డైరీ చూస్తే కొంత కాలిపోయింది. ఎవరో కాల్చితే కాలినట్టో.. లేక ప్రమాదం వల్ల కాలిపోయినట్టో కనిపిస్తుంది. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో ఏమైనా డైరీ దొరికిందా? అనేది సస్పెన్స్ గా ఉంది. ఒకవేళ ప్రమాద సమయంలో.. ఆయన పాకెట్ లో ఆ డైరీ కనుక ఉన్నట్టు సినిమాలో చూపిస్తే కనుక సీన్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది.

అయితే ఆరోగ్య శ్రీ తరహాలో ఇంకా ఇలాంటి మేలు చేసే అంశాలు ఆ డైరీలో ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. వైఎస్సార్ ను అమితంగా అభిమానించే వారికి ఖచ్చితంగా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మరి యాత్ర 2లో డైరీలో మిగిలిన అంశాల గురించి ప్రస్తావన ఉంటుందా? లేక ఆరోగ్య శ్రీ గురించి మాత్రమే ఉంటుందా అనేది సినిమా చూస్తేనే గానీ తెలియదు. మరి యాత్ర 2 టీజర్ లో మీరు డైరీలో ఉన్న ఆరోగ్య శ్రీ అంశానికి కనెక్ట్ అయితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş