iDreamPost
android-app
ios-app

హాలీవుడ్ హీరోయిన్‌గా టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్.. అవంతిక వందనపు లైఫ్ స్టోరీ

  • Published Jan 29, 2024 | 11:39 AM Updated Updated Jan 29, 2024 | 1:43 PM

Avantika Vandanapu Biography: బ్రహ్మోత్సవం సినిమాతో బాల నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్ లో దుమ్మురేపుతుంది. మీన్ గర్ల్స్ అనే మూవీతో టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచింది. దీంతో అవంతిక నేపథ్యం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. మరి అచ్చ తెలుగమ్మాయి అవంతిక వందనపు లైఫ్ స్టోరీ మీ కోసం.

Avantika Vandanapu Biography: బ్రహ్మోత్సవం సినిమాతో బాల నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్ లో దుమ్మురేపుతుంది. మీన్ గర్ల్స్ అనే మూవీతో టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచింది. దీంతో అవంతిక నేపథ్యం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. మరి అచ్చ తెలుగమ్మాయి అవంతిక వందనపు లైఫ్ స్టోరీ మీ కోసం.

  • Published Jan 29, 2024 | 11:39 AMUpdated Jan 29, 2024 | 1:43 PM
హాలీవుడ్ హీరోయిన్‌గా టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్.. అవంతిక వందనపు లైఫ్ స్టోరీ

ఒక వంట నూనె ప్రకటనలో ‘అమ్మ చేసింది మిస్.. లైట్ గానే ఉంటుంది’ అనే డైలాగ్ తో పాపులర్ అయ్యింది అవంతిక వందనపు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి.. ఆ వెంటనే హాలీవుడ్ టీవీ సిరీస్, సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడీ అవంతిక యూత్ అందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయింది. కుకింగ్ ఆయిల్ ప్రకటనప్పుడు ఇంత ఉండేది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ అయిపోయింది. ఇంత షార్ట్ జర్నీలో ఎలా సాధ్యం అని ముక్కున వేలేసుకుంటున్నారు. అసలీ ఎవరీ అమ్మాయి అని తెగ వెతుకుతున్నారు. మరి తెలుగు అమ్మాయి అయిన అవంతిక వందనపు లైఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

అవంతిక వందనపు నేపథ్యం:

అవంతిక వందనపు.. అమెరికాలో కాలిఫోర్నియాలో స్థిరపడిన అచ్చ తెలుగమ్మాయి. ఈమె తెలుగు కుటుంబంలో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు హైదరాబాద్ కి చెందిన వారే. ఆ తర్వాత కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి కావడంతో ఈమె తన నట ప్రస్థానాన్ని తెలుగు సినిమాలతోనే మొదలుపెట్టింది. అయితే హాలీవుడ్ సినిమాల్లో నటించాలని చిన్నప్పుడు ఒక గోల్ ని పెట్టుకుంది. అందుకోసం చదువుకుంటూనే.. ‘అమెరికన్ కన్జర్వేటరీ థియేటర్’ లో నటన నేర్చుకుంది అవంతిక. కూచిపూడి, కర్ణాటక సంగీతం నేర్చుకుంది. 2014లో ఓ టీవీ షో నిర్వహించిన ‘డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ నార్త్ అమెరికా ఎడిషన్ లో పాల్గొని సెకండ్ ప్లేసులో నిలిచింది. ఆ తర్వాత 2015లో రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి బ్రహ్మోత్సవం కాగా.. మరొకటి మనమంతా.

avanthika vandanapu life story

నిజానికి వీటి కంటే ముందు నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆ మూవీ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బ్రహ్మోత్సవం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత మనమంతా సినిమాలో మెరిసింది. ప్రేమమ్ మూవీలో మడోనా సెబాస్టియన్ చైల్డ్ హుడ్ పాత్రలో నటించింది. ఆ తర్వాత రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. భూమిక అనే మూవీ ద్వారా కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో నటించాలనేది అవంతిక కల. దీంతో హాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంది.

హాలీవుడ్ లో మీరా రాయల్ డిటెక్టివ్ అనే అమెరికన్ యానిమెటెడ్ సిరీస్ తో మొదటి అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో కమల పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఆ తర్వాత ‘డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్’ అనే టెలివిజన్ సిరీస్ లో మోనికా అనే పాత్రలో నటించింది. మూడో అవకాశంతో ఏకంగా డిస్నీ ఛానల్ వారి మూవీలో లీడ్ రోల్ చేసే ఆఫర్ పట్టేసింది. ఆ తర్వాత స్పిన్ అనే మూవీలో లీడ్ రోల్ లో నటించింది. ఆ తర్వాత సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్ అనే సినిమాల్లో నటించింది. ఈ మూవీలో అవంతిక హాట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. సెక్సీ అనే హాట్ సాంగ్ తో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ చేసింది. బ్రహ్మోత్సవంలో మనం చూసిన పిల్లేనా ఈ పిల్ల అని ఆశ్చర్యపోయేలా చేసింది.

ఇటీవల రిలీజైన మీన్ గర్ల్స్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా నిలిచింది అవంతిక వందనపు. ఈమె నటించిన హోరోస్కోప్ అనే హారర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అలానే ‘ఏ క్రౌన్ ఆఫ్ విషెస్’ అనే మూవీలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది. అమెరికన్ యాసలో గల గల మాట్లాడే అవంతిక.. తెలుగులోనూ అంతే చక్కగా మాట్లాడుతుంది. డాన్సర్ గా, సింగర్ గా, నటిగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా హాలీవుడ్ లో దుమ్మురేపుతున్న అవంతిక వందనపు.. మన భారతీయ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కూడా సత్తా చాటాలని ఆశిద్దాం.   

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom