iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ టు బాలీవుడ్.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్

  • Published Nov 27, 2023 | 9:19 PM Updated Updated Nov 27, 2023 | 9:19 PM

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా రేంజ్ ను అమాంతం పెంచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. మరోసారి యానిమల్ మూవీతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ సందీప్ వంగ హర్షవర్దన్ ను ఎంచుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా?

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా రేంజ్ ను అమాంతం పెంచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. మరోసారి యానిమల్ మూవీతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ సందీప్ వంగ హర్షవర్దన్ ను ఎంచుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా?

  • Published Nov 27, 2023 | 9:19 PMUpdated Nov 27, 2023 | 9:19 PM
టాలీవుడ్ టు బాలీవుడ్.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమా.. 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేస్తేనే ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. అంచనాలకు తగ్గట్టు విజయం సాధించాలంటే ఒకరిద్దరు పనిచేస్తే సరిపోదు. చిత్ర యూనిట్ అంతా కలిసి కట్టుగా పనిచేస్తేనే విజయం సొంతమవుతుంది. అయితే సినిమాకు కథతో పాటు సంగీతం కూడా ఎంతో ప్రభావం చూపిస్తది. మూవీ సక్సెస్ లో మ్యూజిక్ చాలా కీలకం. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆడియెన్స్ ను మెప్పించడంలో ముందువరుసలో ఉంటాయి. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు మ్యూజిక్ అందించే డైరెక్టర్స్ టాప్ పొజిషన్ లో నిలిచిపోతారు. ఆ వరుసలో హర్ష వర్ధన్ రామేశ్వర్ ముందుంటారు. ఆడియెన్స్ మతిపోగొట్టే మ్యూజిక్ తో అదరగొడుతున్నారు హర్షవర్ధన్.

మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ పేరు ఇప్పుడు బాలీవుడ్ లో మారు మ్రోగుతోంది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ యానిమల్. రణ్ బీర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఎంతో మంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ సందీప్, హర్ష వర్ధన్ ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారనే సందేహం కలగక మానదు. దానికి బలమైన కారణం హర్ష వర్ధన్ టాలెంట్ అని చెప్పక తప్పదు. గతంలో సందీప్ డైరెక్షన్ లో విజయ్ దేవర కొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డికి కూడా హర్షవర్ధన్ మ్యూజిక్ అందించారు.

ఈ సినిమాలో హర్షవర్ధన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటికీ అది ట్రెండింగ్ లోనే ఉంది. హర్షవర్ధన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారు. ప్రస్తుతం యానిమల్ మూవీలో కూడా తన మార్క్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరో ట్రెండ్ సెట్ చేసేందుకు సిద్ధమయ్యారు హర్షవర్ధన్. డైరెక్టర్ సందీప్ కోరుకుంటే ఇండస్ట్రీలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ హర్షవర్ధన్ లోని టాలెంకు ముగ్ధుడైన సందీప్ యానిమల్ మూవీకి కూడా హర్షవర్ధన్ నే ఎంచుకున్నారు. ఇక ఇప్పటికే ట్రైలర్ టీజర్లతో బజ్ క్రియేట్ చేసిన యానిమల్ డిసెంబర్ 01న పాన్ ఇండియా లెవల్ లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş