iDreamPost
android-app
ios-app

యాత్ర 2.. సోనియా గాంధీ పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌!

  • Published Nov 07, 2023 | 12:52 PM Updated Updated Nov 07, 2023 | 1:15 PM

వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటించారు అనటం పొరపాటే అవుతుంది. ఎందుకంటే.. మమ్ముట్టి ఆ పాత్రలో జీవించారు....

వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటించారు అనటం పొరపాటే అవుతుంది. ఎందుకంటే.. మమ్ముట్టి ఆ పాత్రలో జీవించారు....

  • Published Nov 07, 2023 | 12:52 PMUpdated Nov 07, 2023 | 1:15 PM
యాత్ర 2.. సోనియా గాంధీ పాత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా వ్వావ్‌ అనిపించింది. ఇక, ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించారు. ఇతర కీలక పాత్రల్లో.. అశ్రిత వేముగంటి, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటించారు.

వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటించారు అనటం పొరపాటే అవుతుంది. ఎందుకంటే.. మమ్ముట్టి ఆ పాత్రలో జీవించారు. ఏకంగా మహానేతనే తెరపైకి వచ్చాడా అనేట్టుగా చేశారు. ఈ క్రెడిట్‌ మొత్తం దర్శకుడు మహీ వీ రాఘవకు చెందుతుంది. సినిమాను చాలా అద్భుతంగా తీర్చి దిద్దారు. దర్శకుడు మహీ ఇప్పుడు మరో బృహత్‌కార్యానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆయన యాత్ర 2 పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలను తెరమీదకు తీసుకురాబోతున్నారు.

ప్రజాసంకల్పయాత్ర, 2019 ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌ పాత్రలో తమిళ స్టార్‌ హీరో జీవా కనిపించనున్నారు. చిత్రానికి సంబంధించిన అప్‌డేట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు విడుదలవుతూ ఉన్నాయి. తాజాగా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ఆ పోస్టర్‌లో ఉన్న నటి అచ్చం సోనియా గాంధీ లాగే ఉంది.

సోనియా గాంధీ పాత్రలో జర్మనీకి చెందిన సుజానే బెర్నెర్ట్‌ నటిస్తున్నారు. ఆ పోస్టర్‌లోని సోనియా గాంధీ పాత్రధారి కుర్చీలో కూర్చుని ధీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది. కింద ‘‘ If You Can’t Defeat Him Destroy Him’’ అని రాసి ఉంది. తెలుగులో దానర్థం .. ‘‘ అతడ్ని మీరు ఓడించలేకపోతే.. నాశనం చేయండి’’ అని వస్తుంది. సోనియా గాంధీ వైఎస్‌ జగన్‌ను ఉద్ధేశించే ఈ లైన్‌ అన్నట్లు మనకు అర్థం అవుతుంది.  2024 ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే. మరి, యాత్ర 2 సోనియా గాంధీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet