iDreamPost
android-app
ios-app

Yatra 2 Song: యాత్ర-2 నుండి “చూడు నాన్న” ఎమోషనల్ సాంగ్! దేవుడు నమ్మకం, YSR నిజం!

  • Published Jan 19, 2024 | 12:08 PM Updated Updated Jan 19, 2024 | 1:27 PM

Choodu Nanna Song From Yatra 2: యాత్ర 2 సినిమాను దర్శకుడు మహీ వీ రాఘవ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాత్రకు సీక్వెల్‌గా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవితం ఉండనుంది.

Choodu Nanna Song From Yatra 2: యాత్ర 2 సినిమాను దర్శకుడు మహీ వీ రాఘవ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాత్రకు సీక్వెల్‌గా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవితం ఉండనుంది.

  • Published Jan 19, 2024 | 12:08 PMUpdated Jan 19, 2024 | 1:27 PM
Yatra 2 Song: యాత్ర-2 నుండి “చూడు నాన్న” ఎమోషనల్ సాంగ్! దేవుడు నమ్మకం, YSR నిజం!

దివంగత నేత  వైఎస్సార్‌ రాజకీయ జీవితం ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించారు. మహీ వీ రాఘవ దర్శకత్వం వహించారు. 2019, ఫిబ్రవరి 8వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్‌ సక్సెస్‌ అయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. యాత్ర 2 పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాజకీయ జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు.

ప్రజా సంకల్ప యాత్ర, 2019 ఎన్నికల్లో విజయం నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీనుంచి ఓ పాట విడుదలైంది. ‘‘ చూడు నాన్న’’ అంటూ సాగే ఈ పాట అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. పాటలోని ఓ డైలాగ్‌ కన్నీళ్లు తెప్పించేదిలా ఉంది.

yathra 2 song released

వైఎస్‌ జగన్‌, మహిళకు మధ్య జరిగే సంభాషణ :

వైఎస్‌ జగన్‌ : ఎందమ్మా వైఎస్‌ జగన్‌ ఫొటో పక్కన మా నాయన ఫొటో పెట్టినారు.
మహిళ : మా కూతురి కోసం మేం సహాయం అడగని మనిషి లేడు. తిరగని ఆస్పత్రి లేదు. మొక్కని దేవుడు లేడు. ఈ రోజు నా కూతురు పిలిస్తే.. పలుకుతోంది. నన్ను అమ్మా అని పిలుస్తోందంటే.. దానికి కారణం మీ నాయన. ఆయన ఫొటో దేవుడి పక్కన ఉంటే తప్పేమి ఉంది. అన్నా.. దేవుడు నమ్మకం అన్నా.. కానీ, వైఎస్సార్‌ నిజం.

అన్న డైలాగ్‌ పాటకే హైలెట్‌గా నిలుస్తుంది. ఎంతో ఎమోషనల్‌గా సాగే ఈ డైలాగ్‌తో గూస్‌ బమ్స్‌ వస్తాయి. ఇక, పాట మొత్తం ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతీ ఫ్రేమలో జీవా వైఎస్‌ జగన్‌ పాత్రలో ఒదిగిపోయి నటించారు. తెరపై జీవా కాకుండా.. వైఎస్‌ జగన్‌ కనిపిస్తారు. మరి, యాత్ర 2లోని ‘‘ చూడు నాన్న’’ అనే ఈ ఎమోషనల్‌ పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş