iDreamPost
android-app
ios-app

యాత్ర 2 : చంద్రబాబు పాత్ర చేసేదెవరంటే..

  • Published Oct 27, 2023 | 4:54 PM Updated Updated Oct 27, 2023 | 4:54 PM

ప్రజాసంకల్పయాత్ర, 2019 ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో ప్రముఖ తమిళ హీరో జీవా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగా కనిపించనున్నారు.

ప్రజాసంకల్పయాత్ర, 2019 ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో ప్రముఖ తమిళ హీరో జీవా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగా కనిపించనున్నారు.

  • Published Oct 27, 2023 | 4:54 PMUpdated Oct 27, 2023 | 4:54 PM
యాత్ర 2 : చంద్రబాబు పాత్ర చేసేదెవరంటే..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మహీ వీ రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి కనిపించారు. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. యాత్ర సాధించిన విజయంతో యాత్ర 2కు శ్రీకారం చుట్టారు మహీ వీ రాఘవ. ఈ సారి వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సినిమాను తీయబోతున్నారు.

ప్రజాసంకల్పయాత్ర, 2019 ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో ప్రముఖ తమిళ హీరో జీవా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగా కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర 2లో కొన్ని ముఖ్యమైన పాత్రల్లో ఎవరు నటించనున్నారనే దానిపై సోషల్‌ మీడియా బాగా ప్రచారం జరుగుతోంది. యాత్ర 2లో చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించి ఓ న్యూస్‌ తెగ చక్కర్లు కొడుతోంది.

చంద్రబాబు పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ కనిపించనున్నారట. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే సినిమా టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి, యాత్ర 2లో చంద్రబాబు నాయుడు పాత్ర ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ కనిపించనున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş