iDreamPost
android-app
ios-app

Yash: ముగ్గురు ఫ్యాన్స్‌ మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న యశ్‌ కామెంట్లు!

  • Published Jan 09, 2024 | 10:02 AM Updated Updated Jan 09, 2024 | 10:02 AM

యశ్‌ పుట్టిన రోజును సెలెబ్రేట్‌ చేయడానికి కొంతమంది ఫ్యాన్స్‌ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కరెంట్‌ షాక్‌ తగిలింది. ముగ్గురు చనిపోయారు.

యశ్‌ పుట్టిన రోజును సెలెబ్రేట్‌ చేయడానికి కొంతమంది ఫ్యాన్స్‌ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కరెంట్‌ షాక్‌ తగిలింది. ముగ్గురు చనిపోయారు.

  • Published Jan 09, 2024 | 10:02 AMUpdated Jan 09, 2024 | 10:02 AM
Yash: ముగ్గురు ఫ్యాన్స్‌ మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న యశ్‌ కామెంట్లు!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ యశ్‌ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో యశ్‌ ప్లెక్సీలు కడుతూ కొంతమంది అభిమానులు కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. సోమవారం ఉదయం కర్ణాటకలోని గదగ్‌ జిల్లా సురంగి గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో యశ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం సాయంత్రం సురంగి వెళ్లి అభిమానుల కుటుంబాలను పరామర్శిచారు. ఈ సందర్భంగా యశ్‌ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇలాంటి సంఘటనలు జరక్కుండా ఉండాలనే.. తాను సింపుల్‌గా పుట్టిన రోజు వేడుకల్ని జరపాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. అయినప్పటికి ముగ్గురు మరణించటం బాధగా ఉందని అన్నారు. చేతికంది వచ్చిన బిడ్డలు పోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు. యువకుల కుటుంబాలకు తాను అండగా ఉంటానన్నారు. ఏది అవసరమో అది చేస్తానని చెప్పారు. ఆ తల్లిదండ్రులకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా వారి పిల్లలు తిరిగి రారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

yash comments

ఆ కుటుంబాలకు తాను ఎప్పటికీ అండగా ఉంటానన్నారు. వారు కుమారుల స్థానంలో తాను ఉంటానని, కుటుంబాల బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఫ్యాన్స్‌ సంతోషంగా ఉండాలన్నారు. ఏదైనా చేసే ముందు కుటుంబాల గురించి ఆలోచించమని చెప్పారు. ఫ్యాన్స్‌కు చేతులు జోడించి ప్రార్థన చేశారు. మరోసారి ఇలాంటి పనులు చేయకూడదని సూచించారు. ప్లెక్సీలు కట్టవద్దని అన్నారు. గత సంవత్సరం ఇలాంటి ఘటనే జరిగిందని.. తనకు పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలంటేనే భయంగా ఉందని అన్నారు.

కాగా, ఇదే సంఘటనకు సంబంధించి మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం జిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సురంగి గ్రామంలో అభిమానుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం యశ్‌ జిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న అభిమానులను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు సాయం చేస్తానని చెప్పారు. చికిత్స పొందుతున్న వారి ఖర్చులు కూడా యశ్‌ చెల్లించినట్లు సమాచారం.

అభిమానుల ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వ్యక్తిగతంగా తనను కలవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి ఇలాంటి ఘటనలు ఫ్యాన్స్‌ కుటుంబాలనే కాదు.. హీరోలను కూడా కలవర పెడుతున్నాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom