iDreamPost
android-app
ios-app

KGF ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. యశ్ నెక్ట్స్ మూవీపై అప్ డేట్!

  • Published Dec 04, 2023 | 11:55 AM Updated Updated Dec 04, 2023 | 12:08 PM

ప్యాన్‌ ఇండియా స్టార్‌ యశ్‌ తన తర్వాతి సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో తన 19వ చిత్రానికి సంబంధించి...

ప్యాన్‌ ఇండియా స్టార్‌ యశ్‌ తన తర్వాతి సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో తన 19వ చిత్రానికి సంబంధించి...

  • Published Dec 04, 2023 | 11:55 AMUpdated Dec 04, 2023 | 12:08 PM
KGF ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. యశ్ నెక్ట్స్ మూవీపై అప్ డేట్!

కేజీఎఫ్‌ సినిమాలతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్‌. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్‌ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో పాటు.. హీరో యశ్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కన్నడ చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో చాటిన ఈ ఇద్దరూ ప్యాన్‌ ఇండియా స్టార్స్‌ అయిపోయారు. తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన కేజీఎఫ్‌ 2 కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

కేజీఎఫ్‌ 2లో యశ్‌ నటన, మ్యానరిజానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో యశ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. కేజీఎఫ్‌ సినిమాలు సాధించిన విజయంతో యశ్‌ రేంజ్‌ పీక్స్‌లోకి వెళ్లింది. ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడి దృష్టి ఆయన తర్వాతి సినిమాపై పడింది. కేజీఎఫ్‌ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరం మొత్తం కథల ఎంపికకే కేటాయించారు యశ్‌. తన తర్వాతి సినిమా కేజీఎఫ్‌ సినిమాలను మించి ఉండాలన్న ఉద్దేశ్యంతో కొన్ని పదుల కథల్ని పక్కకు పడేశారు.

ఎంతో ఓపిగ్గా మంచి కథ కోసం అన్వేషణ ప్రారంభించారు. తనపై అసహనానికి గురవుతున్న ఫ్యాన్స్‌కు సోషల్‌ మీడియా ద్వారా సర్థి చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో తన తర్వాతి చిత్రం గురించి ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఓ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఆ పోస్టర్‌లో సినిమా పేరు చెప్పలేదు. 8వ తేదీ ఉదయం 9 గంటల 55 నిమిషాలకు చిత్ర టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉండబోతోందని మాత్రమే ఉంది.

ఇది, యశ్‌ 19వ సినిమా.. అంతకు 17,18 సినిమాలుగా కేజీఎఫ్‌ 1,2 తీశారు. రెండింటి ద్వారా ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. ఈ 19 సినిమాను కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణ బాధ్యతల్ని చేపడుతోంది. ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా లెవల్‌లో ఉండనుందన్న టాక్‌ నడుస్తోంది. ఇక, యశ్‌ తన తర్వాతి సినిమా గురించి అప్‌డేట్‌ ఇవ్వటంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ఖుషీలో మునిగిపోయారు. సోషల్‌ మీడియా వేదికగా యశ్‌కు ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నారు. యశ్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. శాండల్‌వుడ్‌ డీ బాస్‌ దర్శన్‌ అభిమానులు కూడా ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నారు. మరి, యశ్‌ 19 సినిమా అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet