iDreamPost
android-app
ios-app

నటుడి భార్య అంత్యక్రియలకు యశ్‌.. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!

  • Published Aug 09, 2023 | 2:27 PM Updated Updated Aug 09, 2023 | 2:27 PM
  • Published Aug 09, 2023 | 2:27 PMUpdated Aug 09, 2023 | 2:27 PM
నటుడి భార్య అంత్యక్రియలకు యశ్‌.. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!

ప్రముఖ కన్నడ హీరో విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన కన్నుమూసిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌ టూరులో ఉన్న ఆమె ఆదివారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం బెంగళూరులోని హరిశ్చంద్ర ఘాట్లో స్పందన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందన భౌతిక దేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రాఘవేంద్ర అభిమానుల సందర్శనార్థం ఇంటి దగ్గర ఉంచారు. ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులు ఆమె భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా స్టార్‌ యశ్‌ కూడా స్పందన పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి ఇంటికి వెళ్లారు.

తన మిత్రుడు రాఘవేంద్రను ఓదార్చారు. ఈ సందర్భంగా అభిమానుల పిచ్చి వైఖరికి అద్దం పట్టే సంఘటన చోటుచేసుకుంది. యశ్‌ స్పందన భౌతిక దేహం ఉన్న ప్రాంతానికి రావటంతో కొంతమంది ఫ్యాన్స్‌ ఆయనతో సెల్ఫీలు దిగటానికి పోటీ పడ్డారు. యశ్‌ మాత్రం.. అభిమానుల్ని ఏమీ అనలేక.. ముఖంలో ఎలాంటి భావం లేకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై ‍స్పందిస్తున్న నెటిజన్లు.. చావు ఇంటి దగ్గర యశ్‌తో సెల్ఫీలు దిగటానికి పోటీ పడ్డ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విచక్షణ లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తారు అంటూ మండిపడుతున్నారు. కాగా, 2007లో విజయ్ రాఘవేంద్ర, స్పందనల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ​ రాఘవేంద్ర.. దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ దగ్గరి చుట్టం కావటం విశేషం. ఇక, స్పందన తండ్రి బీకే  శివరామ్ పోలీస్ అధికారిగా రిటైర్‌ అయ్యారు. మరి, చావు ఇంటి దగ్గర అభిమానులు యశ్‌తో ఫొటోలు దిగటానికి ఎగబడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio