iDreamPost
android-app
ios-app

ఆస్కార్ స్టేజ్ పై నగ్నంగా WWE సూపర్ స్టార్ జాన్ సీనా! వైరలవుతున్న వీడియో..

  • Published Mar 11, 2024 | 10:46 AM Updated Updated Mar 11, 2024 | 10:46 AM

96వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ లో ఓ షాకింగ్ దృశ్యం చోటుచేసుకుంది. ఆస్కార్ స్టేజ్ పైకి వరల్డ్ రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సీనా ఒంటిపై నూలు పోగులేకుండా వచ్చాడు. అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది.

96వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ లో ఓ షాకింగ్ దృశ్యం చోటుచేసుకుంది. ఆస్కార్ స్టేజ్ పైకి వరల్డ్ రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సీనా ఒంటిపై నూలు పోగులేకుండా వచ్చాడు. అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది.

  • Published Mar 11, 2024 | 10:46 AMUpdated Mar 11, 2024 | 10:46 AM
ఆస్కార్ స్టేజ్ పై నగ్నంగా WWE సూపర్ స్టార్ జాన్ సీనా! వైరలవుతున్న వీడియో..

ఆస్కార్.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సినీ అవార్డ్. తమ సినిమా కెరీర్ లో ఒక్కసారైనా ఈ అవార్డును దక్కించుకోవాలని ప్రతీ ఒక్క నటీ, నటులు కలలు కంటూ ఉంటారు. ఇక ఈ ఆస్కార్ అవార్డు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది అకాడమీ. తాజాగా జరిగిన 96వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ లో ఓ షాకింగ్ దృశ్యం చోటుచేసుకుంది. ఆస్కార్ స్టేజ్ పైకి వరల్డ్ రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సీనా ఒంటిపై నూలు పోగులేకుండా వచ్చాడు. అతడు అలా న్యూడ్ గా రావడంతో ఒక్కసారిగా అందరూ స్టన్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జాన్ సీనా.. WWE సూపర్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రెజ్లింగ్ తో పాటుగా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు ఈ రెజ్లింగ్ స్టార్. అయితే జాన్ సీనా తాజాగా చేసిన ఓ పని ప్రపంచం మెుత్తాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అసలు విషయం ఏంటంటే? 96వ ఆస్కార్ అకాడమీ అవార్డులను తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో జాన్ సీనా ఆస్కార్ స్టేజ్ పైకి బట్టలు లేకుండా నగ్నంగా వచ్చాడు. దీంతో ఇది చూసిన నటీ, నటులు, ప్రేక్షకులు షాక్ కు గురైయ్యారు. మరికొందరు నవ్వులు చిందించారు. ఈ అవార్డ్స్ లో భాగంగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును అనౌన్స్ చేసే అవకాశం జాన్ సీనాకు దక్కింది.

ఈ క్రమంలో స్టేజ్ పైకి ఒంటిపై నూలుపోగు లేకుండా వచ్చాడు ఈ ఫైటర్. కేవలం విన్నర్ పేరు ఉన్న కార్డు మాత్రమే ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా అడ్డు పెట్టుకుని వచ్చాడు. మూవీస్ లో కాస్ట్యూమ్స్ ఎంత అవసరమో తెలియజేయాలనే ఉద్దేశంతోనే అతడు ఇలా నగ్నంగా దర్శనమిచ్చాడు. అవార్డుకు ఎంపికైన నామినీల పేర్లను ప్లే చేస్తున్న క్రమంలో లైట్స్ ఆఫ్ చేశారు. ఈ సమయంలో కొందరు వచ్చి జాన్ సీనాకు డ్రస్ వేశారు. ఆ తర్వాత విజేతను అనౌన్స్ చేశారు. బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు ను ‘పూర్ థింగ్స్’ సినిమా దక్కించుకుంది. కాగా.. కోట్లాది మంది చూసే ఈ వేడుకలో అతడు ఇలా చేయడం విమర్శలకు దారితీస్తోంది. రెజ్లింగ్ లో సూపర్ స్టార్ అయ్యుండి.. ఇలాంటి పనులు చేయడం ఏంటి? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి జాన్ సీనా ఆస్కార్ స్టేజ్ పై ఇలా న్యూడ్ గా రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఐరన్ మ్యాన్‌ యాక్టర్ కు ఆస్కార్ అవార్డ్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş