Kanguva: సూర్య ముందు బిగ్ టార్గెట్.. ఇది కోలీవుడ్ ఎన్నాళ్ల నుంచో కంటున్న కల!

Kanguva: సూర్య ముందు బిగ్ టార్గెట్.. ఇది కోలీవుడ్ ఎన్నాళ్ల నుంచో కంటున్న కల!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందు ప్రస్తుతం ఓ బిగ్ టార్గెట్ ఉంది. ఇది టార్గెట్ మాత్రమే కాదు.. కోలీవుడ్ ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న కల. మరి ఆ డ్రీమ్ ఏంటి? దాన్ని సూర్య నెరవేర్చుతాడా? ఆ వివరాలు చూద్దాం పదండి.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందు ప్రస్తుతం ఓ బిగ్ టార్గెట్ ఉంది. ఇది టార్గెట్ మాత్రమే కాదు.. కోలీవుడ్ ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న కల. మరి ఆ డ్రీమ్ ఏంటి? దాన్ని సూర్య నెరవేర్చుతాడా? ఆ వివరాలు చూద్దాం పదండి.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విభిన్నమైన స్టోరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా ‘కంగువ’తో మరోసారి ప్రయోగాత్మక చిత్రంతో అభిమానులను మెస్మరైజ్ చేయడానికి సిద్దమైయ్యాడు. అయితే ప్రస్తుతం సూర్య ముందు ఓ బిగ్ టార్గెట్ ఉంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి కోలీవుడ్ కంటున్న కల. మరి ఆ డ్రీమ్ ఏంటిది? దాన్ని సూర్య ఫుల్ ఫిల్ చేస్తాడా? అన్నది వేచిచూడాలి.

డైరెక్టర్ శివ-సూర్య కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘కంగువ’. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం ద్వారా సూర్య ముందు ఓ బిగ్ టార్గెట్ ఉంది. అదే రూ. 1000 కోట్ల క్లబ్ టార్గెట్. అవును ఇప్పటి వరకు కోలీవుడ్ లో వెయ్యి కోట్లు సాధించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఏకంగా నాలుగు చిత్రాలు ఉన్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు బాహుబలి రెండు పార్ట్ లు, ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటుగా లేటెస్ట్ గా కల్కి మూవీ కూడా వెయ్యి కోట్ల మార్క్ ను మంచినీళ్ల ప్రాయంగా దాటింది. ఈ కల మాత్రం కోలీవుడ్ కు అలాగే ఉంది.

తమిళ్ లో కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. వెయ్యి కోట్ల క్లబ్ ను చేరుకోలేకపోయారు. అయితే ఇందులో వాళ్ల తప్పేం లేదు. పైగా వారు దిగ్గజ నటులు. ‘భారతీయుడు 2’తో కమల్ ఈ కలను నెరవేర్చుతాడని అందరూ అనుకున్నారు. కానీ.. ఫలితం నిరాశపరిచింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి విజయ్ ‘గోట్’పై పడింది. దళపతి అయినా ఈ టార్గెట్ ను రీచ్ అవుతాడా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. కోలీవుడ్ కలను నెరవేర్చే బాధ్యతను సూర్య కంగువ మూవీతో తన భుజాలపై వేసుకున్నాడు. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ మూవీ బాలీవుడ్ వాళ్లకు కచ్చితంగా నచ్చుతుందని, వాళ్లకు నచ్చితే.. రూ. 1000 కోట్లు సాధించడం పెద్ద విషయం కాదన్నది మేకర్స్ భావన.

అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలంటే.. హిందీ మార్కెట్ ను మూలాలు పట్టుకోవాలి. పైగా అక్కడ తమిళ్ చిత్రాలకు మార్కెట్ తక్కువ. గతంలో సూర్య మూవీస్ హిందీలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. కానీ, ఈసారి కంగువతో గట్టిగా కొట్టబోతున్నం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. బాబీ డియోల్ తప్పితే.. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ లేరు. దాంతో వెయ్యి కోట్లు సాధ్యం అయ్యేపనేనా అంటూ సినీ పండితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కంగువ సినిమా విజువల్స్, సూర్య లుక్ చూస్తే.. ఈసారి మ్యాజిక్ జరిగేట్టే కనిపిస్తోంది. మరి కోలీవుడ్ ఇన్నేళ్ల కలను సూర్య నెరవేరుస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments