iDreamPost
android-app
ios-app

జూన్ 24 – చిన్న సినిమాల యుద్ధం

  • Published Jun 14, 2022 | 5:21 PM Updated Updated Jun 14, 2022 | 5:21 PM
  • Published Jun 14, 2022 | 5:21 PMUpdated Jun 14, 2022 | 5:21 PM
జూన్ 24 – చిన్న సినిమాల యుద్ధం

వచ్చే వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బాక్సాఫీస్ వార్ చిన్న చిత్రాల మధ్య ఉండబోతోంది. అందులో మొదటిది 23న వస్తున్న రామ్ గోపాల్ వర్మ కొండా. వరంగల్ నేత కొండా మురళి బయోపిక్ గా రూపొందిన ఈ మూవీ మీద పెద్ద అంచనాలేమీ లేవు కానీ వంగవీటి తరహాలో ఏదైనా మినిమమ్ కంటెంట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 24న రాబోతున్న వాటిలో మొదటిది కిరణ్ అబ్బవరం సమ్మతమే. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ లవ్ స్టోరీ మీద యూత్ కి ఓ మోస్తరు ఆసక్తి ఉంది. టీజర్, పాటలు గట్రా బాగానే వెళ్లాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం సూపర్ హిట్ తర్వాత సెబాస్టియన్ డిజాస్టర్ చూసిన కిరణ్ కు ఈ సక్సెస్ చాలా కీలకం.

ఉన్నట్టుండి రేస్ లోకి వచ్చిన ఆకాష్ పూరి చోర్ బజార్ అదే రోజున థియేటర్లలో అడుగు పెట్టనుంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మాస్ బ్యాక్ డ్రాప్ లో డైమండ్ దొంగతనం నేపధ్యంగా తీసుకుని దర్శకుడు జీవన్ రెడ్డి దీన్ని రూపొందించినట్టు ట్రైలర్ చూశాక అర్థమయ్యింది. తండ్రి ఎంత పెద్ద డైరెక్టరైనా హీరోగా సక్సెస్ అందుకోలేకపోతున్న ఆకాష్ పూరికి ఇది హిట్ కావడం చాలా అవసరం. గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే మరో మూవీ కూడా 24నే దిగుతోంది. ప్రమోషన్లు చేస్తున్నారు కానీ ఇది వస్తున్నట్టు జనానికి పెద్దగా ఎక్కడం లేదు. నోటెడ్ ఆర్టిస్టులు ఉన్న టెన్త్ క్లాస్ డైరీస్ ని బరిలో దింపుతున్నారు.

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించి దర్శకత్వం వహించిన 7 డేస్ 6 నైట్స్ సైతం పోటీకి సై అంటోంది. సాయిరాం శంకర్ ఒక పధకం ప్రకారం రేస్ లో ఉంది. షికారు, సదా నన్ను నడిపే సినిమాలు మేము సైతం అంటున్నాయి. మొత్తం రెండు రోజుల్లో 9 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మేజర్ నెమ్మదించగా విక్రమ్ స్టడీగా ఉంది. అంటే సుందరానికి ఈదటం కష్టమే అనిపిస్తోంది. విరాట పర్వం, గాడ్సే తీర్పులు శుక్రవారం రాబోతున్నాయి. ఇవి మాస్, యూత్ ని ఏ మేరకు ఆకట్టుకుంటాయనే దాని మీదే పైన చెప్పిన ఈ తొమ్మిది సినిమాల ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటుంది. అసలే ఓటిటి కాలంలో జనం థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. బలమైన కంటెంట్ ఉంటే తప్ప టికెట్లు కొనేందుకు సిద్ధపడటం లేదు. ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నట్టో మరి

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet