10 రోజుల్లో రిలీజ్! పాన్ ఇండియా రేంజ్ సౌండ్ ఏది?

  • Author ajaykrishna Published - 04:58 PM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 04:58 PM, Sun - 17 September 23
10 రోజుల్లో రిలీజ్! పాన్ ఇండియా రేంజ్ సౌండ్ ఏది?

ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ ల స్ట్రాటజీ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కో సినిమాకు సంబంధించి దర్శకనిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో వేర్వేరు ప్లానింగ్స్ చేస్తుంటారు. జనరల్ గా సినిమా ఒకే భాషలో రిలీజ్ అవుతుందంటే.. ప్రమోషన్స్ హడావిడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అలాంటిది సినిమా పాన్ ఇండియా రేంజ్ లో.. డిఫరెంట్ భాషలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు ప్రమోషన్స్ ఎలా ఉండాలో ఊహించలేం. పాన్ ఇండియా రిలీజ్ అంటే.. ముందు సొంత భాషలో హడావిడి మొదలైతే.. మెల్లగా వారం ముందునుండి మిగతా భాషలలో ప్రెస్ మీట్స్ పెట్టేసి ప్రచారం చేసేస్తుంటారు.

ప్రస్తుతం పాన్ ఇండియా రిలీజ్ అనుకున్న స్కంద మూవీ విషయంలో ఏ సౌండ్ లేకపోవడం గమనార్హం. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు.. మినిమమ్ బజ్ అయితే ఉంది. ఆ బజ్ కూడా బోయపాటి, రామ్ కాంబోతో ఏర్పడిందే. సినిమా ట్రైలర్ చూశాక కంటెంట్ పరంగా అయితే.. జనాలలో ఎక్సయిట్ మెంట్ పెరిగిందా లేదా? అనేది రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే స్కంద మూవీ టీమ్ నుండి ఏ చప్పుడు లేదు.. దీంతో జనాలలో కూడా స్కంద గురించి హైప్ కూడా కనిపించడం లేదు. మరి పాన్ ఇండియా రిలీజ్ అంటే.. సైలెంట్ గా ఉంటే వర్కౌట్ అవుతుందా?

రామ్ తో పాటు క్రేజీ బ్యూటీ శ్రీలీల కూడా ఉంది. వీరి కాంబినేషన్ లో సాంగ్స్ పర్వాలేదు అనిపించినా.. రిలీజ్ ముందు కావాల్సింది ఇది కాదు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి, తమన్ కాంబోలో వస్తున్న సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నా.. బిజీఎం మీద నమ్మకం ఉంటుంది. కానీ.. సినిమా బిజీఎం వరకు ప్రేక్షకులు వెళ్లాలంటే.. తగిన ప్రమోషన్స్ కూడా చేయాల్సి ఉంటుందనేది సినీ వర్గాల వాదన. ఎందుకంటే.. మేకర్స్ ఎలాంటి స్ట్రాటజి ఫాలో అయినా.. కనీసం హీరో అయినా తన ఇమేజ్ ని.. మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేయాలని ఇంకొంతమంది సూచన. ఎలాంటి సౌండ్ లేకుండా స్కంద.. ఇండస్ట్రీలో మార్క్ సృష్టిస్తుందా? అనంటే అది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు. మరి స్కంద గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments