Krishna Kowshik
దేవర ఇచ్చిన హిట్టు కిక్కుతో ఫుల్ జోష్ లో ఉన్నాడు తారక్. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే తన నెక్ట్స్ ప్రాజెక్టుకు షిఫ్ట్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా చేస్తున్నాడు. కాగా, ఈ మూవీకి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందట.
దేవర ఇచ్చిన హిట్టు కిక్కుతో ఫుల్ జోష్ లో ఉన్నాడు తారక్. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే తన నెక్ట్స్ ప్రాజెక్టుకు షిఫ్ట్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా చేస్తున్నాడు. కాగా, ఈ మూవీకి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందట.
Krishna Kowshik
దేవర ఇచ్చిన హిట్టుతో మంచి స్వింగ్‌లో ఉన్నాడు తారక్. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే తన నెక్ట్స్ ప్రాజెక్టుకు షిఫ్ట్ అయ్యాడు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో మాస్ పల్స్ పట్టుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ 31గా తెరకెక్కతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 21 నుండి జరుపుకోనున్నట్లు తెలుస్తుంది. 1969 బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ ఉండబోతుందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో బంగ్లాదేశ్ రైతుగా తారక్ కనిపించబోతున్నాడన్న టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ స్టామినాకు తగ్గట్లుగా కథను సిద్ధం చేశాడట నీల్ మామ. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం కాస్ట్ ఎంపికలో బిజీగా ఉన్నాడట నీల్. ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. యంగ్ టైగర్ సరసన ఓ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. కన్నడ కస్తూరి రుక్మిణీ వసంత్ ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మ్యాన్ ఆఫ్ ది మాసెస్‌కి జోడి కట్టబోయే ఈ రుక్మిణీ వసంత్ ఎవరు అని ఇంట్రస్ట్ చూపుతున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. ఎనౌన్స్ మెంట్ రాకుండానే రుక్మిణీపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బెంగళూరులో పుట్టిన రుక్మిణీ వసంత్‌ది ఆర్మీ బ్యాగ్రౌండ్. తండ్రి వసంత్ వేణుగోపాల్ కల్నల్. 2007లో జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ఉరీ వద్ద జరిగిన పోరులో మరణించారు. ఆయన మరణానంతరం అశోక చక్రతో సత్కరించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఆమె తల్లి సుభాషిణీ.. భరత నాట్య కళాకారిణీ. రుక్మిణీ వసంత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, సెంటర్ ఫర్ లెర్నింగ్స్‌లో చదువుకుంది. కానీ నటనపై ఆసక్తితో లండన్ వెళ్లి బ్లూమ్స్ బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్ నుండి పట్టా పొందింది. 2019లో కన్నడ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది రుక్మిణీ. ఆ తర్వాత అప్స్ స్టార్స్ అనే బాలీవుడ్ చిత్రంలోనూ నటించింది. కానీ ఆమెకు పేరు తెచ్చింది మాత్రం.. సప్త సాగారాలు దాటి ఎల్లో.
ఈ సినిమా రెండు పార్టులుగా వచ్చిన సంగతి విదితమే. ఈ సినిమాలకు మంచి అప్లాజ్ రావడంతో పాటు ప్రియ పాత్రలో రుక్మిణీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తన నటనతో అనతికాలంలోనే స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు బోలెడంత యాక్టింగ్ స్కిల్ ఉండటంతో వరుసగా ఛాన్సులు క్యూ కట్టాయి. ఇక మిగిలిన ఇండస్ట్రీలపై కూడా మెల్లిగా దృష్టి సారించింది ఈ చందనపు బొమ్మ. ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాలపై ఏక కాలంలో ఫోకస్ చేసింది. మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది. ఆమె మూవీ లైనప్స్ చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే. కన్నడలో శ్రీ మురళి హీరోగా వస్తున్న భగీరతో పాటు, శివకుమార్ హీరోగా రాబోతున్న భైరతి రనగల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో నిఖిల్ సిద్దార్ద్ హీరోగా రాబోతున్న అప్పుడో, ఎప్పుడో, ఎప్పుడో అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ నవంబర్ 8న విడుదల కాబోతుంది. వీటితో పాటు తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఏస్, శివ కార్తీకేయన్ హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుంది. ఇప్పుడు తారక్ మూవీలో ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దీంతో అనూహ్య రీతిలో క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. రుక్మిణీ కూడా రష్మిక మందన్నలా పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి.