iDreamPost
android-app
ios-app

హీరో వడ్డే నవీన్ ఎక్కడ? కనిపించకపోవడానికి కారణం?

  • Published Sep 10, 2024 | 12:45 PM Updated Updated Sep 12, 2024 | 12:21 PM

Vadde Naveen: వడ్డే నవీన్.. ఈ తరానికి తెలియని ఓ స్టార్ హీరో. లవ్ స్టోరీస్, కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్న ఈ నటుడు.. అనూహ్యంగా సినిమాల నుండి తప్పుకున్నాడు. చాలా మంది ఫెయిడ్ అవుట్ అయిన హీరోలంతా కమ్ బ్యాక్ ఇస్తున్న వేళ.. వడ్డే నవీన్ పేరు బయటకు వస్తుంది. ఇంతకు ఆయన ఎక్కడ, ఏం చేస్తున్నారంటే..?

Vadde Naveen: వడ్డే నవీన్.. ఈ తరానికి తెలియని ఓ స్టార్ హీరో. లవ్ స్టోరీస్, కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్న ఈ నటుడు.. అనూహ్యంగా సినిమాల నుండి తప్పుకున్నాడు. చాలా మంది ఫెయిడ్ అవుట్ అయిన హీరోలంతా కమ్ బ్యాక్ ఇస్తున్న వేళ.. వడ్డే నవీన్ పేరు బయటకు వస్తుంది. ఇంతకు ఆయన ఎక్కడ, ఏం చేస్తున్నారంటే..?

  • Published Sep 10, 2024 | 12:45 PMUpdated Sep 12, 2024 | 12:21 PM
హీరో వడ్డే నవీన్ ఎక్కడ? కనిపించకపోవడానికి కారణం?

90స్, 2000 దశకంలో ఆకట్టుకున్న స్టార్ హీరోల్లో ఒకరు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ సెపరేట్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాడు. హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, మంచి హెయిర్ స్టైల్, సినిమాల్లో హుందాగా ఉండే అతడి తీరు చాలా ముచ్చటగా ఉంటుంది. తన చిత్రాల్లో ఎక్కువగా అమ్మాయిలకు సపోర్టుగా నిలిచే పాత్రలు చేశాడు. అందుకే అతడి లేడీ ఫాలోయింగ్ ఎక్కువ. 1997లో కోరుకున్న ప్రియుడితో మొదలైన అతడి జర్నీ.. 2016 ఎటాక్ వరకు సాగింది. కానీ అక్కడ నుండి అనూహ్యంగా నటనకు బ్రేక్ ఇచ్చాడు. గ్యాప్ తీసుకుని మంచి కథతో మళ్లీ తిరిగి వస్తాడని అనుకున్నారు. కానీ ఎనిమిదేళ్లయినా ఎలాంటి అప్ డేట్ లేదు. అలాగే మీడియాకు, సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నాడు. దీంతో నవీన్‌కు ఎక్కడ, ఏమైపోయాడు అనుకుంటారు ఆయన ఫ్యాన్స్.

వడ్డే నవీన్.. ఈ తరానికి తెలియని ఓ స్టార్ సెలబ్రిటీ. హీరో కాక ముందు తండ్రి బాటలో నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కించాడని చాలా తక్కువ మందికి తెలుసు. శ్రీ ఏడు కొండల స్వామి, రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన పెళ్లానికి ప్రేమ లేఖ, ప్రియురాలికి శుభలేఖ చిత్రాలకు నిర్మాత ఆయనే. ఇక నటనపై ఆసక్తితో 1997లో హీరోగా మారాడు. తొలి మూవీ కోరుకున్న ప్రియుడు చిత్రంతో మంచి మార్కులు కొట్టేశాడు నవీన్. ఆ తర్వాత వచ్చిన పెళ్లి.. తన కెరీర్‍లోనే బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. వడ్డే నవీన్ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయేలా చేసింది.  ప్రియ ఓ ప్రియా ఓకే అనిపించినా, చెలికాడు, పెళ్లాడి చూపిస్తా , లవ్ స్టోరీ 1999 చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. ట్రాక్ మార్చి కొత్త కథలు ఎంపిక చేసుకున్నాడు. అలా వచ్చినవే స్నేహితులు, మనసిచ్చి చూడు, నా హృదయంలో నిదురించే చెలి.

కుటుంబ కథా చిత్రాల హీరోగా మారాడు. అలాగే నెగిటివ్ రోల్‌లో కూడా మెప్పించాడు వడ్డే నవీన్. ప్రేమించే మనసు చిత్రంలో ప్రియురాలి కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రియుడిగా కనిపిస్తాడు. చాలా బాగుందిలో కూడా కాస్తంత నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయి. ఇక అక్కడ నుండి అతడి సక్సెస్ ట్రాక్ గాడి తప్పింది. వరుస సినిమాలు చేసినా.. ప్లాప్ లేదా డిజాస్టర్లుగా మారాయి. నా ఊపిరి మినహాయించి మిగిలినవన్నీ రొటిన్ స్టోరీలు చేశాడు నవీన్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో కనిపించినప్పటికీ.. అవి కూడా అతడి కెరీర్‌కు బూస్టర్ కాలేకపోయాయి. ఈ మధ్యలోనే ఎన్టీఆర్ మనవరాలు చాముండేశ్వరితో ( రామకృష్ణ కూతురు) వివాహ బంధం బీటలు వారడంతో సినిమాలకు మెల్లిగా దూరం అయ్యాడు. చివరిగా మంచు విష్ణు ఎటాక్ మూవీలో కనిపించాడు ఒకప్పటి స్టార్ హీరో.

రెండో వివాహం చేసుకున్న వడ్డే నవీన్‌కు ఇద్దరు పిల్లలు. కూతురు, కొడుకు జిష్ణు ఉన్నారు. ఇటీవల కొడుకు ధోతీ ఫంక్షన్ వేడుకలు నిర్వహించగా.. మెగాస్టార్ చిరంజీవి, రోజా, శ్రీకాంత్, రాశి వంటి టాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఇక సినిమాలకు స్వస్థి చెప్పిన బిజినెస్ రంగంలో స్థిరపడినట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతూ అభిమానుల్ని ఖుషీ చేస్తుంటాడు. ఒకప్పటి స్టార్ హీరోలంతా ఇప్పుడు కం బ్యాక్ ఇచ్చి ఆకట్టుకుంటున్న తరుణంలో.. నవీన్ కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు. మళ్లీ యాక్ట్ చేసి ప్రేక్షకులను కనువిందు చేయాలని ఆశిద్దాం.. ఏమంటారు..?

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio