iDreamPost
android-app
ios-app

అప్పట్లో సెన్సేషన్ అయిన లెజెండ్ హీరో శరవణన్ ఎక్కడ? ఏమైపోయాడంటే?

  • Published Aug 26, 2024 | 6:12 PM Updated Updated Aug 26, 2024 | 6:12 PM

Arul Saravanan: తమిళనాడులో ది లెజెండ్ శరవణన్ స్టోర్స్ గురించి తెలియని వారుండరు. సూది దగ్గర నుండి ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుందని టాక్. తన ప్రొడక్టులకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు ఈ స్టోర్ ఎండీ అరుళ్ శరవణన్. నటనపై ఆసక్తితో హీరోగా మారాడు. కానీ ఇప్పుడు..

Arul Saravanan: తమిళనాడులో ది లెజెండ్ శరవణన్ స్టోర్స్ గురించి తెలియని వారుండరు. సూది దగ్గర నుండి ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుందని టాక్. తన ప్రొడక్టులకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు ఈ స్టోర్ ఎండీ అరుళ్ శరవణన్. నటనపై ఆసక్తితో హీరోగా మారాడు. కానీ ఇప్పుడు..

  • Published Aug 26, 2024 | 6:12 PMUpdated Aug 26, 2024 | 6:12 PM
అప్పట్లో సెన్సేషన్ అయిన లెజెండ్ హీరో శరవణన్ ఎక్కడ? ఏమైపోయాడంటే?

ది లెజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి వారసత్వాన్ని తీసుకుని బిజినెస్ రంగంలో అడుగు పెట్టి.. సక్సెస్ ఫుల్ ఎంటర్ ప్రెన్యూయర్‌గా కొనసాగుతున్నాడు. తన స్టోర్లకు తానే బ్రాండ్ అంబాసిడర్. పెద్ద పెద్ద హీరోయిన్లతో యాడ్స్ చేస్తూ సెలబ్రిటీగానూ మారాడు. కోట్లు కుమ్మరించి హీరోలను పెట్టుకునే స్థోమత ఉన్నా.. నటనపై ఆసక్తితో ఆయనే నటించాడు. వ్యాపార రంగంలో సక్సెస్ అయినా.. సినిమా అంటే పిచ్చి, ఫ్యాషన్ ఉండటంతో లేటు వయస్సులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 51 ఏళ్ల వయస్సులో ది లెజెండ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ సృష్టించాడు. తనే నిర్మాతగా మారి పాన్ ఇండియన్ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు పెట్టాడు. ఇందులో ఊర్వశి రౌతాలా, గీతికా తివారీ హీరోయిన్లు. 2022లో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.

అయితే సినిమా కన్నా అతడిపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఆయన నటన కన్నా.. పర్సనల్‌గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు కొందరు. ఈ వయస్సులో సినిమాలు అవసరమా అన్న వారు లేకపోలేదు. హీరో ఇలా ఉన్నాడేంటీ అంటూ కామెంట్స్ చేశారు. కానీ అవేమీ పట్టించుకోకుండా సినిమాలపైనే దృష్టిపెట్టాడు. అలాగే మేకోవర్‌పై వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు. తనను తాను మార్చుకున్నాడు. ఓ కొత్త అప్డేట్ ఇచ్చాడు. ఇటీవల గరుడన్ మూవీతో హిట్ అందుకున్న ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్‌తో మూవీ షురూ చేశాడు శరవణన్. కొత్త లుక్కును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు ఈ మిలినీయర్. మాస్ అండ్ రఫ్ లుక్స్‌లో కనిపించాడు. మీసం, గెడ్డం పెంచి సీరియస్ రోల్ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎనౌన్స్ అయ్యి.. నెలలు గడుస్తున్నా.. ఈ మూవీ నుండి మరో కొత్త అప్డేట్ లేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేడు ఈ నటుడు.

దీంతో లెజెండ్ శరవణన్ ఏమయ్యాడు.. ఏం చేస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు. ఏదైనా మూవీ అప్డేట్ ఇవ్వకపోతాడా అని ఎదురు చూస్తున్నారు. అయితే దొరై సెంథిల్ కుమార్ మూవీతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడని కోలీవుడ్ ఇన్నర్ టాక్. ఈ సారి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట ఈ లెజెండ్ స్టార్ అరుళ్. అందుకే సైలెంట్‌గా వర్క్ చేసుకెళుతున్నాడు. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడట శరవణన్. ఇక వ్యక్తిగత విషయాల విషయానికి వస్తే.. అరుళ్ తండ్రి పేరు సెల్వరత్నం. తండ్రి నెల్లై జిల్లా నుంచి చెన్నైకు వచ్చి టీ వ్యాపారం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత శరవణ స్టోర్స్‌తో బిజినెస్ మెన్‌గా మారారు. ఈయన ఇద్దరు తమ్ముళ్లు కూడా భాగస్వాములుగా ఉండేవాళ్ళు. అయితే వయసొచ్చాక అరుళ్ శరవణన్ బాబాయ్‌ల నుంచి వేరు పడి.. ది లెజెండ్ శరవణ పేరుతో కొత్త స్టోర్స్ మొదలుపెట్టారు. అది సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Legend Saravanan (@yoursthelegend)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet