iDreamPost
android-app
ios-app

నీ స్నేహం మూవీలో ఉదయ్ స్నేహితుడిగా నటించిన ఈ నటుడు ఏమైపోయాడంటే..?

  • Published Sep 03, 2024 | 5:21 PM Updated Updated Sep 03, 2024 | 5:21 PM

నీ స్నేహం మూవీలో ఉదయ్ స్నేహితుడిగా యాక్ట్ చేసిన నటుడు గుర్తున్నాడా..? ఫ్రెండ్ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయడు. చివరకు తన ప్రేమను కూడా త్యాగం చేస్తాడు. ఇప్పుడు ఆ నటుడు ఏమైపోయాడు.? ఎందుకు నటించడం లేదంటే..?

నీ స్నేహం మూవీలో ఉదయ్ స్నేహితుడిగా యాక్ట్ చేసిన నటుడు గుర్తున్నాడా..? ఫ్రెండ్ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయడు. చివరకు తన ప్రేమను కూడా త్యాగం చేస్తాడు. ఇప్పుడు ఆ నటుడు ఏమైపోయాడు.? ఎందుకు నటించడం లేదంటే..?

  • Published Sep 03, 2024 | 5:21 PMUpdated Sep 03, 2024 | 5:21 PM
నీ స్నేహం మూవీలో ఉదయ్ స్నేహితుడిగా నటించిన ఈ నటుడు ఏమైపోయాడంటే..?

‘ఎప్పటికీ నా మదిలో కొలువున్నదీ నువ్వైనా.. చెప్పుకునే వీలున్నా.. ఆ సంగతి ఎపుడైనా’ ఈ మూవీ ఏ సినిమాలోది అంటే ఠక్కున చెప్పేస్తారు నీ స్నేహం. దివంగత నటీనటులు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లు. పరుచూరి మురళీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు నిర్మించారు. 2002లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ హైలెట్. ప్రతి పాట ఇప్పటికీ చార్ట్ బస్టరే. ఇందులో ఉదయ్ స్నేహితుడిగా శ్రీను పాత్రలో మెప్పించాడు ఓ నటుడు. అతడు బాలీవుడ్ నటుడు.. జతిన్ గ్రేవాల్. నీ స్నేహంలో ఉదయ్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ యాక్సిడెంట్‌కు గురౌతాడు. ఈ మూవీలో అతడ్ని, అతడి నటనను మర్చిపోలేం. ఇప్పుడు ఆ నటుడు ఎక్కడ ఉన్నాడు.? ఏం చేస్తున్నాడు? ఎంతలా మారిపోయాడో తెలుసా..? ఎందుకు నటించడం లేదంటే..?

జతిన్ గ్రేవాల్… ఉత్తరాఖండ్‍లో పంజాబీ ఫ్యామిలీలో పుట్టాడు. చండీఘర్‌లో పెరిగిన ఇతడు. చదువులు పూర్తయ్యాక.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. కామసూత్ర, రేమండ్స్, థమ్స్ అప్, లెవీస్, సింథాల్, ఇండిగో నేషన్, తాజ్ హోటల్స్ వంటి యాడ్స్ చేశాడు. అంతే కాదు పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా కనిపించాడు. వీటిల్లో మంచి పేరొచ్చింది. అలా పాప్ సాంగ్స్ చేస్తుండగా.. హీరోగా అవకాశం వచ్చింది. రాహుల్ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జతిన్.. నీ స్నేహం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అతడు.. ఫిల్మ్ స్టార్ చిత్రంలో నటించాడు. ఇక తెలుగులో బాలకృష్ణ పల్నాటి బ్రహ్మానాయుడు మూవీలో కనిపించాడు. అక్కడ నుండి తెలుగు సినిమాలే చేయలేదు.

హిందీలో అనామిక, లవ్ యూ సోనియా, షార్ట్ కట్ రోమియో, ఇంటర్నేషనల్ హీరో వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు జతిన్. పంజాబీ,హిందీ చిత్రాలు చేశాడు. 2016 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ ఇప్పుడు అతడు వ్యాపార రంగంలో స్థిరపడినట్లు తెలుస్తుంది. 2010లో కరోలినా మాచి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. జతిన్ తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అతడు నటించడం లేదని సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలను పంచుకుంటున్నాడు జతిన్. ఇన్ స్టాలో అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. అప్పటికీ, ఇప్పటికీ అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్నాడు ఈ యాక్టర్.

 

View this post on Instagram

 

A post shared by Jatin Grewal (@jatinbuntygrewal)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş