iDreamPost
android-app
ios-app

హీరో చంద్రహాస్ ఎక్కడ? ఈ మధ్య కనిపించక పోవడానికి కారణం?

  • Published Aug 24, 2024 | 2:59 PM Updated Updated Aug 24, 2024 | 2:59 PM

Chandra Hass: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. శాటిలైట్ ఛానల్స్ అభివృద్ధి చెందుతున్న తొలి నాళ్ల నుండి స్మాల్ స్క్రీన్ పై ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు తన కొడుకును హీరోగా పరిచయం చేశాడు. ఈ ఇంట్రడక్షన్ తోనే చంద్రహాస్ పేరు ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది.. కానీ

Chandra Hass: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. శాటిలైట్ ఛానల్స్ అభివృద్ధి చెందుతున్న తొలి నాళ్ల నుండి స్మాల్ స్క్రీన్ పై ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు తన కొడుకును హీరోగా పరిచయం చేశాడు. ఈ ఇంట్రడక్షన్ తోనే చంద్రహాస్ పేరు ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది.. కానీ

  • Published Aug 24, 2024 | 2:59 PMUpdated Aug 24, 2024 | 2:59 PM
హీరో చంద్రహాస్ ఎక్కడ? ఈ మధ్య కనిపించక పోవడానికి కారణం?

యాహూ అనే గేమ్ షోతో తనదైన యాంకరింగ్‌‌లో ఓ నూతన ఒరవడి సృష్టించారు ప్రభాకర్. అప్పటికే బుల్లితెరపై స్క్రీన్‌ప్లే రైటర్‌గా, నటుడిగా, హోస్టుగా వ్యవహరించి సెలబిట్రీ అయ్యాడు.ఈటీవీలో ఎన్నో సంవత్సరాలు కొనసాగడటంతో ఆయనకు ఈటీవీ ప్రభాకర్ అన్న ముద్రకూడా పడింది. అలాగే క్రియేటివ్ ప్రోగ్రామ్స్ చేసి మెప్పించడంతో ఆయనకు బుల్లితెర మెగాస్టార్ అనే బిరుదు కూడా వచ్చింది. ఇంత సాధించినా ఆయన బుల్లితెరపై మక్కువని పెంచుకుంటూనే పోయారు. ఇప్పుడు నిర్మాతగా పలు సీరియల్స్ తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన భార్య మలయజ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా యాక్టివ్ అయ్యారు. యూట్యూబ్ ఫన్ వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. చంద్రహాస్, దివిజ. వీరిలో చంద్రహాస్‌కి పరిచయం అవసరం లేదు. జస్ట్ ఒక్క పరిచయ కార్యక్రమంతోనే చంద్రహాస్ రీచ్ రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసింది.

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు కవర్ సాంగ్ చేసి యూట్యూబ్‌లో పాపులర్ అయ్యాడు చంద్రహాస్. దుమ్ములేపే డ్యాన్సుతో ఇరగదీశాడు. ఈ వీడియోకు వ్యూస్ మాత్రమే కాదు.. చంద్రహాస్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. కొడుకుకు నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన ప్రభాకర్ అండ్ మలయజ.. అతడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. అలా ఓ మూవీ కూడా స్టార్ట్ అయ్యింది. ఆ పరిచయ వేదిక మీదే చంద్రహాస్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. రీచ్ ఎలా వచ్చినా.. మనోడికి మాత్రం ఒక రేంజ్‌లో క్రేజ్ వచ్చేసింది. అయితే.. అప్పటి నుండి చంద్రహాస్.. ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఇటు ఇన్ స్టాలో కూడా ఎటువంటి అప్డేట్స్ పంచుకోవడం లేదు. దీంతో చంద్రహాస్ ఏమయ్యాడు.. ఏం చేస్తున్నాడని అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ బుల్లితెర మెగాస్టార్ తనయుడు.

గతంలో అతడు హీరోగా బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ పేరుతో సినిమా మొదలైంది. కేట్ అనే అమ్మాయి హీరోయిన్‌గా నటిస్తుంది. గత ఏడాది ఈ మూవీ అఫిషియల్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఆర్కేఏకే ఫిల్మ్స్, ఐఈఎఫ్ కార్పొరేషన్ పతాకంపై రొమాంటిక్, యాక్షన్ అండ్ డ్రామా మూవీగా తెరకెక్కుతోంది. కిరణ్ బోయిన పల్లి, కిరణ్ జక్కం శెట్టి నిర్మిస్తున్నారు. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ మూవీ కంప్లీట్ కాగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. దీనితో పాటు మరో మూవీ కూడా సైలెంట్‌గా చేసుకుపోతున్నాడట చంద్రహాస్. ఈ రెండు చిత్రాలు ఈ నెలఖారుకు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడట చంద్రహాస్. idreampost.comకి ఈ విషయాన్ని స్వయంగా ప్రభాకర్ తెలియచేశారు. మరి.. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో ప్రేక్షకుల ముందకు రావడానికి సిద్దమవుతున్న చంద్రహాస్‌కి మంచి సక్సెస్ లు అందాలని, అతని కెరీర్ సాఫీగా సాగాలని కోరుకుందాము. మరి.. చంద్రహాస్ మూవీస్ కోసం మీరు ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chandra Hass (@chandrahass8)

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş