iDreamPost
android-app
ios-app

యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎక్కడ? ఈ మధ్య కనిపించక పోవడానికి కారణం?

  • Published Aug 23, 2024 | 7:21 PM Updated Updated Aug 23, 2024 | 7:21 PM

బుల్లితెరపై యాంకర్స్ అనగానే.. ముందుగా ఫీమేల్ హోస్టులే గుర్తుకు వస్తారు. లేడీ హవా ఎక్కువగా కొనసాగే స్మాల్ స్క్రీన్ పై తన యాంకరింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. అయితే కొన్ని రోజుల నుండి ప్రదీప్ కనిపించలేదు. కారణం ఏంటంటే..?

బుల్లితెరపై యాంకర్స్ అనగానే.. ముందుగా ఫీమేల్ హోస్టులే గుర్తుకు వస్తారు. లేడీ హవా ఎక్కువగా కొనసాగే స్మాల్ స్క్రీన్ పై తన యాంకరింగ్ తో ఆకట్టుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. అయితే కొన్ని రోజుల నుండి ప్రదీప్ కనిపించలేదు. కారణం ఏంటంటే..?

  • Published Aug 23, 2024 | 7:21 PMUpdated Aug 23, 2024 | 7:21 PM
యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎక్కడ? ఈ మధ్య కనిపించక పోవడానికి కారణం?

స్మాల్ స్క్రీన్‌పై హోస్టులుగా ఆకట్టుకున్న యాంకర్స్.. బిగ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు ప్రదీప్ మాచిరాజు. ఫీమేల్ యాంకర్స్ హవా నడుస్తున్న సమయంలో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గడసరి అత్త సొగసరి కోడలు షోతో మహిళా అభిమానాన్ని చూరగొన్నాడు. మహిళా యాంకర్లకు ధీటుగా షోను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు ప్రదీప్. తన వాక్చాతుర్చంతో, అద్బుతమైన టైమింగ్‌తో షోకే అందాన్ని తెచ్చాడు. ఈ షో హిట్ కొట్టడంతో వరుస పెట్టి హోస్టుగా ఆఫర్స్ వచ్చాయి. అతడ్ని అందరికీ దగ్గర చేసిన స్పెషల్ షో కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా. స్టార్ హీరోలను తనదైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. ఫన్ క్రియేట్ చేస్తూ ఫ్యామిలీ అండ్ యంగ్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. అయితే గత కొన్ని రోజుల నుండి ప్రదీప్ యాంకర్ కనిపించడం లేదు.

అటు బుల్లితెరపైనే కాదు.. ఇటు వెండితెరపై కూడా కానరావడం లేదు. దీంతో ప్రదీప్ ఏమయ్యాడు అంటూ లేడీ ఫ్యాన్స్ .. టీవీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే..ప్రదీప్ మాచిరాజు మరో సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆ సినిమా షూటింగ్ నేపథ్యంలో షోస్ ఏమీ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఆ సినిమా కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలోనే బయటకు రావాలన్న ఉద్దేశంలో ఉన్నాడట ప్రదీప్. అందుకే కొత్త షోస్ ఏమీ ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కో యాంకర్.. దీపికా పిల్లి హీరోయిన్‌గా నటిస్తుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రదీప్ హోస్టుగా చేస్తూనే.. సినిమాల్లో స్మాల్ రోల్స్‌లో మెరిశాడు. వరుడు, 100% లవ్, అత్తారింటికి దారేదీ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాడు.

anchor pradeep

30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హనుమాన్ బ్యూటీ అమృతా అయ్యర్ హీరోయిన్. 2021లో విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే హీరోగా మారాక.. ప్రదీప్ గిరిగీసుకుని కూర్చోలేదు. తన వద్దకు వచ్చిన స్టోరీలు వింటూనే.. బుల్లితెరపై సందడి చేస్తూనే ఉన్నాడు. ఢీ షోకి యాంకరింగ్ చేస్తూ.. సరిగమక కూడా హోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో కూడా సర్కార్ షో చేశాడు. ఇది కూడా సక్సెస్ అయ్యింది. ఆ సమయంలో ఓ కథ నచ్చి ఓకే చేశాడని ఇన్నర్ టాక్. ఈ క్రమంలోనే ఇటు షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల.. షోలకు కాస్త గ్యాప్ ఇచ్చి షూటింగ్ కంప్లీట్ చేశాడు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet