iDreamPost
android-app
ios-app

నాగమ్మ సీరియల్ చిన్నారి గుర్తుందా? హీరోయిన్ అయిందని తెలుసా?

  • Published Aug 06, 2024 | 8:06 PM Updated Updated Aug 06, 2024 | 8:06 PM

2000వ దశకంలో బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టిన సీరియళ్లలో ఒకటి నాగమ్మ. జెమిని టీవీలో ఆదివారం ప్రసారం అయ్యేది. ఇందులో బాల నాగమ్మగా అలరించిన చిన్నారి గుర్తుందా...? ఇప్పుడు ఏం అయ్యిందంటే..?

2000వ దశకంలో బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టిన సీరియళ్లలో ఒకటి నాగమ్మ. జెమిని టీవీలో ఆదివారం ప్రసారం అయ్యేది. ఇందులో బాల నాగమ్మగా అలరించిన చిన్నారి గుర్తుందా...? ఇప్పుడు ఏం అయ్యిందంటే..?

  • Published Aug 06, 2024 | 8:06 PMUpdated Aug 06, 2024 | 8:06 PM
నాగమ్మ సీరియల్ చిన్నారి గుర్తుందా? హీరోయిన్ అయిందని తెలుసా?

వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా కొన్ని హారర్, థ్రిల్లర్ అండ్ డివోషనల్ స్టోరీలతో వచ్చిన సీరియల్స్ ఆకట్టుకున్నాయి. భయపడుతూనే వాటిని చూసి ఎంజాయ్ చేసేవారు టీవీ ప్రేక్షకులు. మర్మదేశం అంటూ గుర్రం పరుగెడుతూ వస్తుంటే గుండె దడ దడ కొట్టుకోవాల్సిందే. అలాగే రహస్యం, అన్వేషిత, అలౌకిక, మనోయజ్ఞం, నాగమ్మ వంటి సీరియల్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో నాగమ్మకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేవారు. జెమిని టీవీలో ప్రతి ఆదివారం రాత్రి వచ్చే ఈ సీరియల్ కోసం వారం అంతా ఎదురు చూసేవారంటే నమ్మండి. అంతలా ఆకట్టుకుంది ఈ సీరియల్. ‘పున్నమిలోన వెన్నల వాన చలువుదనలా చల్లని తల్లి నాగమ్మా…’ అంటూ సాగిపోయే సాంగ్ వింటూటేనే గూస్ బంప్స్ వచ్చేసేవి. వన్నులో వణుకు పుట్టించేది ఈ సీరియల్.

ఇందులో జేవీ సోమయాజులు, నిన్నే పెళ్లాడతా సీరియల్ యాక్టర్ శ్రీనివాస్, నీరజ, సుభాషిణి, ఉష ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇక ఇందులో బాలనాగమ్మగా మెప్పించిన నటి గాయత్రి గుర్తుందా. పెద్ద బొట్టుతో, అందమైన కట్టుబొట్టుతో దేవతలా కనిపించేది. ఆమె కనిపించిదంటే చాలు పూనకాలు వచ్చేసేవి. అంతలా ఆకట్టుకున్న ఆ చిన్నారి పేరు గాయత్రి. రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి.. చైల్ట్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేసింది.  జెమిని టీవీలో ప్రసారమైన మహిళ అనే సీరియల్లో యాక్ట్ చేసింది. పలు సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత నాగమ్మ చేసింది. ఈ సీరియల్ హిట్ కావడంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నోట్ బుక్ అనే చిత్రంలో ఆకట్టుకుంది.

Nagamma serial actress gayatri present life

మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ సాలూరి హీరో. ఇందులో నందినీ క్యారెక్టర్‌లో మెప్పించింది. ఈ సినిమాతో ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో పాటలు కూడా చాలా ఆకట్టుకున్నాయి. ‘ఈ గాలిలో ఊరేగు రాగాలలో, సిరి సిరి మువ్వ.. విరిసిన పువ్వా’ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమా తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె అంతగా అలరించలేకపోయింది. పద్దతిగా ఉంటే అవకాశాలు రావనుకున్న అమ్ముడు.. గ్లామర్ డోస్ పెంచి నటించినా ఉపయోగం లేకుండా పోయింది.  మ్యీవ్, గంగపుత్రులు, వెయింట్ ఫర్ యు, అదే నీవు అదే నేను, గ్రీకు వీరుడు వంటి చిత్రాలు చేసింది. గ్లామరస్ పాత్రలు చేసింది. అయితే ఆ తర్వాత కోలీవుడ్ బాట పట్టి.. అక్కడ అవకాశాలు లేక పూర్తిగా తెరకు దూరమైందని అంటుంటారు. ప్రస్తుతం ఈ నటి ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలియలేదు.  చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. అసలు ఈమె మొత్తానికి కనుమరుగైంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş