iDreamPost
android-app
ios-app

హనుమంతుడిగా రిషబ్ శెట్టి అయితే.. మరి రానా..?

  • Published Nov 05, 2024 | 2:31 PM Updated Updated Nov 05, 2024 | 2:31 PM

ఈ ఏడాది సంక్రాతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలియంది కాదు. ఈ క్రమంలోనే ఇప్పుడు దానికి సిక్వెల్ అయినా జై హనుమాన్ నుంచి.. రిషబ్ ను పరిచయం చేస్తూ ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. మరి రిషబ్ హనుమాన్ అయితే రానా ఎవరు అనే సందేహాలు మొదలయ్యాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.

ఈ ఏడాది సంక్రాతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలియంది కాదు. ఈ క్రమంలోనే ఇప్పుడు దానికి సిక్వెల్ అయినా జై హనుమాన్ నుంచి.. రిషబ్ ను పరిచయం చేస్తూ ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. మరి రిషబ్ హనుమాన్ అయితే రానా ఎవరు అనే సందేహాలు మొదలయ్యాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Nov 05, 2024 | 2:31 PMUpdated Nov 05, 2024 | 2:31 PM
హనుమంతుడిగా రిషబ్ శెట్టి అయితే.. మరి రానా..?

2024 లో థియేటర్స్ దగ్గర ఎన్నో ఊహించని అద్భుతాలు జరిగాయి. ఇది పక్కాగా హిట్ అవుతుందనుకుని.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు బోల్తా పడ్డాయి. బడా హీరోల సినిమాలు కూడా ఇందులో భాగమే. ఇక మరో వైపు ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన చిన్న సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అలాంటి సినిమాలలో ప్రశాంత్ వర్మ డైరి నుంచి వచ్చిన ఓ అద్భుతం హనుమాన్. ఈ ఒక్క సినిమాతో అతని రేంజ్ మారిపోయింది. ఈ సినిమా క్లైమాక్స్ లోనే పార్ట్ 2 ఉంటుందనే హింట్ ఇచ్చారు. హనుమాన్ కొనసాగింపుగా జై హనుమాన్ ను రీసెంట్ గా అఫీషియల్ గా మరోసారి అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీ నిర్మాణ సంస్థ మారిపోయింది. ఈ సినిమాకు ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వీరి చేతికి వచ్చిన తర్వాత జై హనుమాన్ బడ్జెట్ , స్కేల్ రెండు మారిపోయాయి.

ఎవరు ఊహించని విధంగా రిషబ్ శెట్టిని మెయిన్ లీడ్ గా తీసుకుని వచ్చారు. దీనితో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దానికి తోడు రీసెంట్ గా థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. దీనితో సినిమా ఎలా ఉండబోతుందా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ రీసెంట్ గా ప్రశాంత్ వర్మ.. రిషబ్ శెట్టి , రానా దగ్గుబాటి తో ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో అందరికి కొత్త ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి. హనుమంతుడిగా రిషబ్ శెట్టి నటిస్తుంటే.. మరి రానా ఎవరు అనే సందేహం అందరికి వస్తుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం .. రానా దశకంఠుడు రావణాసుడి క్యారెక్టర్ చేయనున్నట్లు టాక్. రానా కట్ అవుట్ కు ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పి తీరాల్సిందే. ఈ న్యూస్ అయితే ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. ఇదంతా సరే రానా రావణుడు , రిషబ్ హనుమంతుడు.. మరి రాముడు ఎవరు అనేది నెక్స్ట్ ప్రశ్న.

ఇప్పటివరకు అయితే ఈ క్యారెక్టర్ గురించి ఎక్కడా ఎలాంటి టాక్ వినిపించలేదు. అటు స్టార్ హీరోలు కూడా ఎవరి సినిమాలతో వారు బిజీ బిజీగా ఉన్నారు. రాముడు క్యారెక్ట్ కు సరిగ్గా సూట్ అయ్యే కట్ అవుట్స్ టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. మరి ప్రశాంత్ వర్మ వారిలో ఎవరిని చూస్ చేసుకుంటాడో చూడాలి. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడి ఫోకస్ అంతా కూడా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా మీదే ఉంది. ఆ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే జై హనుమాన్ ఉంటుంది. కానీ ఇంత ఎర్లీగా అప్డేట్స్ ఇవ్వడం వెనుక రీజన్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 2025 లో అటు రిషబ్ శెట్టి నుంచి కాంతార2 మూవీ రిలీజ్ కానుంది. సో ఈ లెక్కన చూస్తే.. జై హనుమాన్ మూవీ వచ్చేది 2026లోనే. దీనికి సంబంధించి ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet