iDreamPost
android-app
ios-app

Weekend Reminder: ఈ వీకెండ్ OTTలోకి కొత్త సినిమాలు! మూడు థ్రిల్లర్స్, ఒక కామెడీ మూవీ!

  • Published Apr 18, 2024 | 5:39 PM Updated Updated Apr 26, 2024 | 6:22 PM

సినిమాలు, సిరీస్ లంటే ఈ మధ్య అందరికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. దీనితో వీకెండ్ వచ్చిందట అందరికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ గుర్తొస్తున్నాయి. సో ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలేంటో కూడా లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ రిమైండర్ వచ్చేస్తుంది. మరి ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన లిస్ట్ ఏంటో చూసేద్దాం.

సినిమాలు, సిరీస్ లంటే ఈ మధ్య అందరికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. దీనితో వీకెండ్ వచ్చిందట అందరికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ గుర్తొస్తున్నాయి. సో ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలేంటో కూడా లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ రిమైండర్ వచ్చేస్తుంది. మరి ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన లిస్ట్ ఏంటో చూసేద్దాం.

  • Published Apr 18, 2024 | 5:39 PMUpdated Apr 26, 2024 | 6:22 PM
Weekend Reminder: ఈ వీకెండ్ OTTలోకి కొత్త సినిమాలు! మూడు థ్రిల్లర్స్, ఒక కామెడీ మూవీ!

ప్రతి శుక్రవారం ఎలా అయితే కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయో.. అలానే ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో.. వచ్చే వారం ఓటీటీ లోకి ఎలాంటి సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటున్నారు. పైగా ఇక స్టూడెంట్స్ అందరికి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి.. ఇక నుంచి రిలీజ్ అవ్వబోయే సినిమాలకు, సిరీస్ లకు .. ఓటీటీ లలో ఆదరణ బాగా లభించేస్తుందని చెప్పడంలో.. ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మళ్ళీ శుక్రవారం వచ్చేస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతాయో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. అయినా సరే ప్రేక్షకులు ఆయా సినిమాలను మిస్ చేయకుండా ఉండేదుకు ఇప్పుడు మళ్ళీ ఒక రిమైండర్ వచ్చేస్తుంది. మరి ఏప్రిల్ 19 న ఏ సినిమాలు ఏ ప్లాట్ ఫార్మ్ లోకి రానున్నాయో చూసేద్దాం.

ఏప్రిల్ 19 న ఓటీటీ లలోకి రాబోయే సినిమాల జాబితా ఇలా ఉంది.

1) మై డియర్ దొంగ : ఆహా ఓటీటీ
అభినవ్ గోమటం నటించిన మూవీ “మై డియర్ దొంగ”. ఈ కామెడీ మూవీ ఆహా ఓటీటీలోకి ఏప్రిల్ 19 వస్తోంది. తాజాగా ఆహ ప్లాట్ ఫార్మ్ “అమ్మ బాబోయ్, దొంగోడు! మీ నవ్వులు దోచేందుకు ‘ట్రైలర్’ తో వచ్చాడు!!” అనే ట్యాగ్ లైన్ తో.. ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. కామెడి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూసేయొచ్చు.

2) రణం : ప్రైమ్ వీడియో
ఇది ఒక తమిళ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తలలు కనపడిన డెడ్ బాడీస్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే దిశగా ఈ సినిమా స్టోరీ ఉండబోతుంది. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ లో ఒకటిగా ఈ సినిమా ఉండబోతుంది. నందితా శ్వేతా , వైభవ్ రెడ్డి లాంటి స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అలరించారు.

3) సైరెన్ : హాట్‌స్టార్
ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పటివరకు ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ తమిళంతోపాటు తెలుగులోనూ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సైరెన్ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఒక చేయని తప్పుకు దాదాపు 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఒక అంబులెన్స్ డ్రైవర్ చుట్టూ తిరిగే కథ ఇది.

4) ఆర్టికల్ 370 : జియో సినిమా
థియేటర్స్ లో ఆర్టికల్ 370 చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీ లో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యామి గౌతమ్, ప్రియమణి లాంటి ఫేమిలియర్ స్టార్స్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిపించే ఆర్టికల్ 370ని తొలగించిన ఘటనల చుట్టూ తిరిగే కథే ఈ సినిమా స్టోరీ.

5) రెబెల్ మూన్-పార్ట్ 2: ది స్కార్ గీవర్ : నెట్ ఫ్లిక్స్
ఈ సినిమా పార్ట్ 1 గా రెబల్ మూన్ : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్” సినిమా వచ్చింది. ఈ సినిమా అంతా కూడా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా.. డైరెక్టర్ జాక్ స్నెడర్ తెరకెక్కించారు. ఈ దర్శకుడికి హాలీవుడ్ లో చాలా గొప్ప పేరు ఉంది. జాక్ స్నెడర్ తన సినిమాలతో.. ఓ డిఫరెంట్ టేకింగ్ తో ఓ ఫాంటసీ వరల్డ్ ను సృష్టిస్తుంటాడు. ఇలా తన సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు పార్ట్-1 లానే, “రెబెల్ మూన్-పార్ట్ 2: ది స్కార్ గీవర్” కూడా ఉండబోతుంది.

ఈ వీకెండ్ రిలీజ్ కాబోయే ఈ సినిమాలను అసలు మిస్ కాకండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet