iDreamPost
android-app
ios-app

హీరోయిన్ బ్రెస్ట్ పై వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇచ్చింది!

  • Published Feb 13, 2024 | 2:47 PM Updated Updated Feb 13, 2024 | 2:47 PM

పెళ్లి చేసుకుంటే సినిమా అవకాశాలు రావు అనే హీరోయిన్లకు ఆమె మినహాయింపు. వివాహం అయ్యాకే ఆమె ఖాతాలో మంచి హిట్ మూవీస్ పడ్డాయి. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ సీరియల్ చేసింది. అయితే ఆమెపై..

పెళ్లి చేసుకుంటే సినిమా అవకాశాలు రావు అనే హీరోయిన్లకు ఆమె మినహాయింపు. వివాహం అయ్యాకే ఆమె ఖాతాలో మంచి హిట్ మూవీస్ పడ్డాయి. ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ సీరియల్ చేసింది. అయితే ఆమెపై..

  • Published Feb 13, 2024 | 2:47 PMUpdated Feb 13, 2024 | 2:47 PM
హీరోయిన్ బ్రెస్ట్ పై వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇచ్చింది!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా చెలామణి అయిన నటీమణులు..పెళ్లి, పిల్లలు అంటూ ఫ్యామిలీ లైఫ్‌లోకి వెళ్లిపోతున్నారు. కాస్త విరామం తీసుకుని సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేస్తున్నారు. ఇప్పుడు మరింత నాజూగ్గా.. ఫిట్‌గా కూడా కనిపిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్.. ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు కనిక. ఆమె నటి మాత్రమే కాదూ గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. దివ్య సుబ్రమణ్యం పేరును సినిమాల కోసం కనికగా మార్చుకుంది. చబ్బీ చబ్బీగా కనిపిస్తూ.. అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఫైవ్ స్టార్ అనే మూవీతో తమిళనాట ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే తెలుగులోకి అడుగుపెట్టింది.

తెలుగులో శ్రీకాంత్ సరసన ఒట్టేసి చెబుతున్నాలో నటించింది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ అవకాశాలు మాత్రం నిల్. ఆ తర్వాత ఒక్క సినిమాకే పరిమితమైంది. తెలుగులో నా ఆటో గ్రాఫ్ .. స్వీట్ మొమొరీస్ మూవీలో రవితేజ వివాహం చేసుకునేది ఈ అమ్మాయినే. చిన్నపాత్రలో కనిపించింది. కన్నడ, తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా.. ఆమెకు ఆశించిన నేమ్ రాలేదు. దీంతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ టాప్ హీరోయిన్ అయ్యింది. మాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టింది. స్టార్ డమ్ తెచ్చుకుంది. 2008లో శ్యామ్ రాధా కృష్ణన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికో బాబు. పెళ్లి తర్వాత కూడా అనేక సినిమాల్లో నటించి.. మంచి హిట్స్ అందుకుంది.

బాబు పుట్టాక సపోర్టింగ్ రోల్స్ చేయడంతో పాటు బుల్లితెరపై సందడి చేసింది. ఏతిర్నిచల్ అనే సీరియల్లో కనిపించింది. ఇందులో ఆమె కాస్త బొద్దుగా మారింది. దీంతో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది కనిక. సోషల్ మీడియాలో తనపై వస్తున్న దారుణమైన కామెంట్స్ గురించి ప్రస్తావించింది. బెస్ట్ పై వల్గర్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లకు అదిరిపోయే రిప్లై ఇచ్చింది.

‘ఇలాంటి కామెంట్స్ ఎందుకు రాస్తున్నారో తెలియదు. మీ ఇంటి ఆడ పిల్లల్లానే నాకు ఉన్నాయి. ఏదైనా కొత్తగా అనిపిస్తున్నాయా..? నా బ్రెస్ట్ పరిమాణం నా హర్మోన్ల మార్పులపై ఆధారపడి ఉంటుంది. గర్భం దాల్చిన.. బిడ్డకు పాలిచ్చే మహిళలందరిదీ ఇదే పరిస్థితి. నాకే కాదూ.. ప్రతి మహిళకు వర్తిస్తుంది. అలా నా బ్రెస్ట్ సైజ్ మారింది. దీనికే అసహ్యకరమైన పదాలను రాస్తున్నారు. ఇలాంటి పోస్టులు చేసే వ్యక్తులను చూస్తున్నప్పుడు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నారో అని అర్థంమౌతుంది. కొంత మంది సెక్సీ డ్రెస్సులు వేయాలని అడుగుతుంటారు. నాకు ఇష్టమైన దుస్తులు నేను ధరిస్తాను. నా కంఫర్టబులిటీ నాకు ముఖ్యం. అలాగే మహిళలను ఎలా చూడాలో నా కొడుకుకు నేర్పిస్తాను’ అంటూ సమాధానమిచ్చింది. కనికా చేసిన వ్యాఖ్యలపై పలువురు అభినందిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş