iDreamPost
android-app
ios-app

ఆ వ్యాధుల వల్ల నరకం చూస్తున్న వితిక షెరు

  • Published Oct 21, 2023 | 8:30 PM Updated Updated Oct 21, 2023 | 8:49 PM

ఆ నొప్పి భరించలేనంతగా ఉండేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్పాండిలైటిస్‌నుంచి బాధనుంచి బయటపడ్డానని తెలిపారు. రెండు వారాల క్రితమే...

ఆ నొప్పి భరించలేనంతగా ఉండేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్పాండిలైటిస్‌నుంచి బాధనుంచి బయటపడ్డానని తెలిపారు. రెండు వారాల క్రితమే...

  • Published Oct 21, 2023 | 8:30 PMUpdated Oct 21, 2023 | 8:49 PM
ఆ వ్యాధుల వల్ల నరకం చూస్తున్న వితిక షెరు

వితిక షేరు.. తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వితిక.. మొదటి సినిమా హీరోతోనే ప్రేమలో పడింది. ‘‘ పడ్డానండి ప్రేమలో మరి’’ సినిమా హీరో అయిన వరుణ్‌ సందేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు దూరం అయింది. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో భర్తతో కలిసి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టుకుని రన్‌ చేస్తోంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పుటికప్పుడు వీడియోల రూపంలో తన ఛానల్‌లో పోస్టు చేస్తూ ఉంటుంది.

తాజాగా, ఆమె తన అనారోగ్య సమస్యలపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోలో.. తనకు స్పాండిలైటిస్‌, మైగ్రేన్‌ ఉన్నాయన్నారు. వాటి కారణంగా విపరీతమైన మెడనొప్పి, తలనొప్పులు వస్తూ ఉన్నాయని, వాటి వల్ల సరిగా పనులు చేసుకోలేకపోతున్నానని తెలిపారు. స్పాండిలైటిస్‌కు ఫిజియోథెరపీ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాజాగా, నీడ్లింగ్‌ చేయించుకున్నానని తెలిపారు. ఆ తర్వాత తన పనులు తాను చేసుకోవటానికి శక్తి లభించిందన్నారు. ఒత్తిడి కారణంగా మెడనొప్పి పెరిగినట్లు పేర్కొన్నారు.

ఆ నొప్పి భరించలేనంతగా ఉండేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్పాండిలైటిస్‌నుంచి బాధనుంచి బయటపడ్డానని తెలిపారు. రెండు వారాల క్రితమే మైగ్రేన్‌ మొదలైందని చెప్పారు. ఈ వ్యాధిని నయం చేయటం కుదరదని, త్వరలోనే కోలుకుని అద్భుతమైన వీడియోలు చేస్తానని అన్నారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. వితిక త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరి, వితిక షేరు స్పాండిలైటిస్‌, మైగ్రేన్‌ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet