ఆడిషన్‌కి వెళ్తే అమ్మ ముందే కమిట్మెంట్ అడిగారు: హీరోయిన్

స్టార్ హీరోయిన్ అయినా సరే కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ వంటి వాటిని ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా మంది ఈ చేదు ఘట్టాలను దాటుకుని వచ్చిన వాళ్ళే.. మీడియా ముందు ఈ నిజాలను బయటపెట్టిన వాళ్ళే. తాజాగా మరో హీరోయిన్ కూడా కమిట్మెంట్ బారిన పడ్డానని.. అది కూడా తన తల్లి ముందే అలా అడిగేశారని గుర్తు చేసుకున్నారు.

స్టార్ హీరోయిన్ అయినా సరే కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ వంటి వాటిని ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా మంది ఈ చేదు ఘట్టాలను దాటుకుని వచ్చిన వాళ్ళే.. మీడియా ముందు ఈ నిజాలను బయటపెట్టిన వాళ్ళే. తాజాగా మరో హీరోయిన్ కూడా కమిట్మెంట్ బారిన పడ్డానని.. అది కూడా తన తల్లి ముందే అలా అడిగేశారని గుర్తు చేసుకున్నారు.

సినిమా రంగంలో హీరోయిన్స్ కి, నటీమణులకు క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ అనేవి చాలా సాధారణంగా ఎదుర్కునే అంశాలు. స్టార్ హీరోయిన్స్ నుంచి ఓ మోస్తరు హీరోయిన్స్ వరకూ చాలా మంది అవకాశాల కోసం వెళ్ళినప్పుడు కమిట్మెంట్ బారిన పడ్డవాళ్లే. అవకాశాల కోసం క్యాస్టింగ్ కౌచ్ ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సినిమా వాళ్ళ ఒత్తిళ్లకు లొంగకుండా ఇంకా సినిమా అవకాశాలను తెచ్చుకుంటూ నెట్టుకొచ్చే హీరోయిన్స్ కూడా ఉన్నారు. తాజాగా హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు కూడా కమిట్మెంట్ బారిన పడ్డానని వెల్లడించారు. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఈమెకు తెలుగులో ఫాలోయింగ్ బాగానే ఉంది.

భీమవరంలో పుట్టిన ఈమె కన్నడ పరిశ్రమ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించారు. తన 15వ ఏటనే కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2008లో వచ్చిన అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాలో నటించారు. వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాకి ఇది రీమేక్. ఈ మూవీలో వితికా షేరు.. త్రిష చెల్లెలిగా చేసిన కలర్స్ స్వాతి పాత్రను పోషించారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో చేయాలని ఇక్కడకు వచ్చారు. 16 ఏళ్ల వయసప్పుడు ఓ తెలుగు సినిమా ఆడిషన్స్ కి వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కన్నడ సినిమా చేసిన తర్వాత తెలుగులో సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానని.. అప్పుడు అవకాశాలు అంత సులువుగా వచ్చేవి కాదని అన్నారు. ఇప్పుడంటే ఇన్ స్టాలో ఫోటోలు, రీల్స్ పెడితే ఛాన్సులు వస్తున్నాయని అన్నారు.

అయితే ఆడిషన్ కి వెళ్ళినప్పుడు తన రంగు తక్కువని రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకున్నారు. తన పేరు వితికా షేరు అన్న పేరు వినగానే తనను నార్త్ అమ్మాయి అనుకునేవారని.. తీరా తెలుగు అమ్మాయి అని తెలిసి చిన్న చూపు చూసేవారని.. చులకనగా మాట్లాడేవారని అన్నారు. 16 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి ఆడిషన్స్ కి వెళ్లానని.. ఒక ప్రాజెక్ట్ కోసం తనను ఎంపిక చేశారని అన్నారు. అయితే అమ్మతో మాట్లాడాలి అని చెప్పి కాసేపటి తర్వాత తనను బయటకు పంపించారని.. అమ్మాయికి ఈ సినిమాలో ఛాన్సు రావాలంటే నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అమ్మతో అన్నారని వితికా షేరు గుర్తు చేసుకున్నారు. అమ్మకి అర్థం కాక మా పాపను పిలవండి అని వాళ్లతో అంటే తనను లోపలకు పిలిచారని వితికా చెప్పుకొచ్చారు. లోపలికి వెళ్ళాక.. కమిట్మెంట్ అంటున్నారు నాకు అర్థం కాలేదు నువ్వే మాట్లాడు అని అమ్మ తనతో చెప్పిందని అన్నారు.

తనకు మేటర్ అర్ధమవ్వడంతో వారి ప్రపోజల్ కి నో చెప్పానని అన్నారు. పారితోషికం ఇవ్వకపోయినా పర్లేదని.. అవకాశం ఇవ్వమని కోరానని.. కమిట్మెంట్ మాత్రం ఇవ్వనని తెగేసి చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. అలా 16 ఏళ్ల వయసులో తాను చేదు అనుభవాన్ని ఎదుర్కున్నానని.. వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్ లోని శ్రీనగర్ లో ఉండేదని అన్నారు. బాగా తెలిసిన వారే తనను కమిట్మెంట్ అడిగారని అన్నారు. అయితే వారి పేర్లు మాత్రం చెప్పలేదు. ఇలాంటివి ఎదుర్కోవడం ఇష్టం లేక సినిమాలకు దూరమైనట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొంత కాలానికి వరుణ్ సందేశ్ ని ప్రేమించి 2016, ఆగస్టు 19న వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం గృహిణిగా కొనసాగుతున్నారు.

Show comments