iDreamPost
android-app
ios-app

కొత్త జర్నీకి శ్రీకారం! వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ పోస్ట్!

  • Author ajaykrishna Published - 09:47 AM, Mon - 14 August 23
  • Author ajaykrishna Published - 09:47 AM, Mon - 14 August 23
కొత్త జర్నీకి శ్రీకారం! వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ పోస్ట్!

సినీతారలైనా.. సామాన్యులైనా లైఫ్ లో ఒక స్టేజ్ కి వచ్చాక వివాహ బంధంలో అడుగు పెట్టాలని అనిపిస్తుంది. పెళ్లి చేసుకొని.. తమకంటూ స్పెషల్ ఫ్యామిలీ.. ఆ మూడు ముళ్ల బంధంలో ఉండే మూమెంట్స్ ని ఆస్వాదించాలని అనుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ కా దాస్ అనిపించుకున్న హీరో విశ్వక్ సేన్.. పెళ్లి ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు కారణం అతను కొత్తగా పెట్టిన పోస్ట్. కెరీర్ పరంగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్.. సడన్ గా తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. కానీ.. ఇదే గుడ్ న్యూస్ లేడీ ఫ్యాన్స్ కి చేదువార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఫేవరేట్ హీరోకి పెళ్లి అవుతుందని బాయ్స్ ఎంత ఆనందిస్తారో.. అదే ఫేవరేట్ హీరో అప్పుడే పెళ్లి చేసుకుంటున్నాడా అని అమ్మాయిలు ఫీల్ అవుతుంటారు.

ఎవరు ఎలా ఫీల్ అయినా.. విశ్వక్ సేన్ చెప్పింది శుభవార్తనే. త్వరలోనే తాను వివాహ బంధంతో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ చూస్తే అర్ధమవుతుంది. ఈ విషయాన్నీ తన ఇన్ స్టాగ్రామ్ లో అనౌన్స్ చేయడం విశేషం. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విశ్వక్.. దర్శకుడిగాను తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అయితే.. ఇంతలోనే ఇలా లైఫ్ లో కొత్త ఫేజ్ స్టార్ట్ చేస్తున్న అంటూ పోస్ట్ పెట్టేసరికి.. పెళ్లి చేసుకోబోతున్నాడని దాదాపు అందరు ఫిక్స్ అయిపోయారు. అయితే.. కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పాడు కానీ.. దానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఆగష్టు 15న పూర్తి వివరాలు రానున్నాయని తెలిపాడు.

ఇంతకీ విశ్వక్ పోస్ట్ లో ఏమని రాసుకొచ్చాడంటే.. ‘నా అభిమానులు, శ్రేయోభిలాషులకు ఇన్నాళ్లుగా నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు రుణపడి ఉంటాను. ఇప్పుడు నా జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమయ్యాను. ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పూర్తి వివరాలు ఆగష్టు 15న ప్రకటిస్తాను’ అని కపుల్ సింబల్ జోడించి చెప్పుకొచ్చాడు. దీంతో తమ హీరో ఓ ఇంటివాడు అవుతున్నాడు అని ఫ్యాన్స్.. నెటిజన్స్ సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం.. విశ్వక్ పెట్టిన పోస్ట్ పెళ్లి గురించి కాదని అంటున్నారు. విశ్వక్ పోస్ట్ పెట్టింది కొత్త ఓటిటి షో గురించి అని.. తాను ఆగష్టు 15న అనౌన్స్ చేయబోయేది ఆహా ఓటిటిలో కొత్త షో అని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఏది నిజం అనేది రేపు విశ్వక్ తెలపాల్సి ఉంది. ఇక ప్రస్తుతం విశ్వక్.. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేస్తున్నాడు. మరి విశ్వక్ పోస్ట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet