iDreamPost
android-app
ios-app

‘గామి’ కంటే పెద్ద రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్న విశ్వక్!

  • Published Mar 06, 2024 | 5:02 PM Updated Updated Mar 06, 2024 | 5:02 PM

Vishwak Sen Experiment: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమానే కాకుండా.. తర్వాతి ప్రాజెక్టు కోసం పెద్ద ప్రయోగానికి రెడీ అయిపోయాడు.

Vishwak Sen Experiment: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమానే కాకుండా.. తర్వాతి ప్రాజెక్టు కోసం పెద్ద ప్రయోగానికి రెడీ అయిపోయాడు.

  • Published Mar 06, 2024 | 5:02 PMUpdated Mar 06, 2024 | 5:02 PM
‘గామి’ కంటే పెద్ద రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్న విశ్వక్!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో విశ్వక్ సేన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే అవకాశం వచ్చే దాకా వెయిట్ చేయకుండా.. తనని తానే లేపుకున్నాడు. అంతేకాకుండా ప్రతి ప్రాజెక్టులో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. అలాగే తన పాత్ర, నటన, వేషధారణలో కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేసేందుకు రెడీ అయిపోయాడు అంటున్నారు. అది కూడా ఇలాంటి రోజుల్లో కాస్త రిస్క్ అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి.. ప్రయోగం ఏంటి? అంత రిస్క్ ఎందుకో చూద్దాం.

విశ్వక్ సేన్ నుంచి ప్రస్తుతం మార్చి 8కి గామి చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అతి పెద్ద ప్రయోగం అనే చెప్పాలి. ఈ మూవీలో ఒక అరుదైన వ్యాధితో బాధ పడుతున్న అఘోరా పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ మూవీనే పెద్ద ప్రయోగం అని చెప్తున్నారు. ఇందులో పాటలు ఉండవు, గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్, ఈలలు వేయించే సీన్స్ ఉండవు అంటూ ముందే చెప్పేశారు. మరి.. సినిమాలో ఆసక్తిరేపే అంశం ఏంటి అంటే.. కథ, టేకింగ్, విజువల్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రయోగం గురించే ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మాట్లాడుకుంటోంది. కానీ, అంతకు మించి మరో రిస్క్ కోసం విశ్వక్ సేన్ రెడీ అయిపోయాడు అంటున్నారు. ప్రస్తుతం ఆ విషయం కూడా టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

విశ్వక్ సేన్ తర్వాతి ప్రాజెక్ట్స్ లో లైలా కూడా ఒకటి. ఈ మూవీకి సంబంధించి విశ్వక్ సేన్ ఇప్పటికే చాలా క్రేజీ వార్తలు పంచుకున్నాడు. వాటిలో లేడీ గెటప్ చేయబోతున్న విషయం కూడా ఒకటి. నిజానికి ఈ విషయం చాలా నెలల క్రితమే రివీల్ చేశాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది. అదేంటంటే.. సినిమా సెకండాఫ్ మొత్తం విశ్వక్ లేడీ గెటప్ లో ఉండబోతున్నాడట. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇలాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి పాత్రలు చేసిన హీరోలు ఉన్నారు. ఇప్పటికే ఇలాంటి పాత్రల్లో కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, మంచు మనోజ్, శివకార్తికేయ లాంటి హీరోలను చూశారు.

ఇప్పుడు విశ్వక్ సేన్ ఇలాంటి ఒక ప్రయోగానికి రెడీ అయిపోయాడు. సెంకాడఫ్ లో దాదాపు లేడీ గెటప్ లోనే ఉండబోతున్నాడు. అంటే మూవీపై నమ్మకం లేకపోతే విశ్వక్ అలాంటి పాత్రను ఒప్పుకోడు. కాబట్టి కథ మీద ఉన్న నమ్మకంతోనే ఆ ప్రయోగానికి రెడీ అయ్యి ఉంటాడు. ఇప్పుడు ఇలాంటి పాత్రలు ఎందుకు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే ఎప్పుడూ రొటీన్ పాత్రలు, ఎలివేషన్స్ తో సినిమాలు చేయడం కంటే ఇలాంటి ప్రయోగాలు చేయడం కూడా మంచిదే. ఆడియన్స్ కి ఫ్రెష్ మూవీస్ చూసిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి విశ్వక్ సేన్ చేసే ప్రయోగం కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాలు అభిమానులకు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం అందరూ గామి గురించే ఆలోచిస్తున్నారు. మార్చి 8న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలి అంటూ కోరుకుంటున్నారు. మరి.. విశ్వక్ సేన్ చేస్తున్న ఈ ప్రయోగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss