iDreamPost
android-app
ios-app

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్.. శివాలెత్తించిన విశ్వక్ సేన్!

  • Published Apr 27, 2024 | 6:17 PM Updated Updated Apr 27, 2024 | 6:17 PM

Gangs Of Godavari Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి టీజర్ వచ్చేసింది. ఈ మూవీ అసలు ఏంటి అనే విషయంపై అయితే గట్టిగానే క్లారిటీ ఇచ్చేశారు. విశ్వక్ కు మరో హిట్ పక్కా అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

Gangs Of Godavari Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి టీజర్ వచ్చేసింది. ఈ మూవీ అసలు ఏంటి అనే విషయంపై అయితే గట్టిగానే క్లారిటీ ఇచ్చేశారు. విశ్వక్ కు మరో హిట్ పక్కా అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

  • Published Apr 27, 2024 | 6:17 PMUpdated Apr 27, 2024 | 6:17 PM
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్.. శివాలెత్తించిన విశ్వక్ సేన్!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి సినిమా వస్తోంది అంటే తెలుగు ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే విశ్వక్ సేన్ మూవీ అంటే మినిమం గ్యారెంటీ అనే మార్క్ పడిపోయింది. పైగా విభిన్నమైన కథలతో విశ్వక్ ఆడియన్స్ ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తూనే ఉంటాడు. ఇటీవల వచ్చిన గామి మూవీనే అందుకు పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వస్తున్నాడు. ఇన్నాళ్లు ఈ మూవీలో ఏదో మ్యాజిక్ ఉంటుందని అంతా నమ్మారు. కానీ, మ్యాజిక్ ఏంటో చెప్పడానికి ఎవరికీ తెలీదు. కానీ, ఇవాళ విడుదల చేసిన టీజర్ చూస్తే ఆ మ్యాజిక్ ఏంటో అర్థమైపోతుంది. అది మరేదో కాదు.. విశ్వక్ సేన్ అనే చెప్పాలి. మరి.. అసలు ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

ఇప్పటి వరకు విశ్వక్ సేన్ గ్యాగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, అప్ డేట్స్ అన్నీ ఆడియన్స్ లో మినిమం గ్యారెంటీ నింపాయి. ఇప్పటివరకు ఈ మూవీపై బాగానే అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ టీజర్ వచ్చిన తర్వాత అవి రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. ఈ మూవీలో కూడా విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో ఉండబోతోంది. అలాగే క్యారెక్టర్ వేరియేషన్స్ కూడా చూపిస్తున్నారు. కింది స్థాయి నుంచి ఒక గొప్ప శక్తిగా ఎదిగినట్లు చూపిస్తున్నారు. ఒక గ్యాంగ్ కి విశ్వక్ లీడర్ గా వ్యవహరిస్తాడు. అలాగే ఈ మూవీలో పొలిటికల్ టచ్ కూడా ఉంది. టీజర్ లో చూపించిన షాట్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అలాగే ఆసక్తిగా కూడా ఉన్నాయి.

ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో డైలాగ్స్ ఇంట్రెస్టింగా ఉన్నాయి. ‘నేను మంచి వాడినో.. చెడ్డ వాడినో తెలీదు. కానీ, మంచివాడు అనే చెడ్డ పేరు మాత్రం నాకొద్దు’ అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలాగే ఆ లంకలో ఒక ఆచారం ఉంటుందంట. ఒక్కసారి కత్తి కడితే ఆ వ్యక్తి అంతు చూసే దాకా ఆ ఊరి జనం నిద్రపోరు. అలాంటి ఆచారం కూడా ఇంట్రెస్టింగా ఉంది. అయితే అసలు విశ్వక్ సేన్ సొంత మనుషులే అతనిపై కత్తి కట్టి.. అతని చావు కోసం వెంటాడుతూ ఉంటడం ఎందుకు అనేది మాత్రం మూవీ చూశాకే తెలుసుకోవాలి. అసలు ఈ గ్యాంగ్స్ ఏంటి? వాళ్ల ఆచారం ఏంటి?

ఎందుకు విశ్వక్ సేన్ అంత ఎదిగిన తర్వాత కూడా ఒంటరిగా మిగిలిపోయాడు? సొంత వాళ్లే ఎందుకు చంపుతున్నారు? అనే ప్రశ్నలు మూవీపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలీ లీడ్ రోల్ల్ ప్లే చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. మే 17 వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. మరి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş