iDreamPost
android-app
ios-app

హీరో హుకుం జారీ చేసినా నిర్మాత మాటే నెగ్గింది! ఆలస్యంగా వస్తున్న విశ్వక్!

  • Author Soma Sekhar Published - 08:53 PM, Mon - 27 November 23

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మాస్ కా దాస్ విశ్వక్ సేన్-నేహాశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మాస్ కా దాస్ విశ్వక్ సేన్-నేహాశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

  • Author Soma Sekhar Published - 08:53 PM, Mon - 27 November 23
హీరో హుకుం జారీ చేసినా నిర్మాత మాటే నెగ్గింది! ఆలస్యంగా వస్తున్న విశ్వక్!

విశ్వక్ సేన్.. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక తన యాటిట్యూడ్ తో, నటనతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇక తాజాగా అతడు నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ మూవీకి చల్ మోహన రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా.. డిసెంబర్ 8న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై గతంలోనే నిర్మాతలకు హుకుం జారీ చేశాడు హీరో విశ్వక్. సినిమా రిలీజ్ వాయిదా వేస్తే.. నేను ప్రమోషన్లకు రానని చెప్పేశాడు.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మాస్ కా దాస్ విశ్వక్ సేన్-నేహాశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా. ఇక ఈ మూవీ రిలీజ్ విషయంలో గతంలోనే విశ్వక్ కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 8న కాకుండా రిలీజ్ ను వాయిదా వేస్తే.. నేను ప్రమోషన్స్ కు రానని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అయితే తర్వాత ఆ పోస్ట్ ను డిలీట్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆలస్యంగా రానున్నట్లు సమాచారం. దానికి కారణం ఏంటంటే?

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి మరో 10 రోజులు పడుతుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సుట్టంలా సూసి పోకలా’ లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపింది. ఈ పాటలో విశ్వక్-నేహా కెమిస్ట్రీకి యూత్ ఫిదా అయ్యారు. మరి ఈ వాయిదా విషయంపై ఇప్పటికైనా మేకర్స్ క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet