iDreamPost
android-app
ios-app

Viswak Sen: లేడీ గెటప్‌లో మాస్ కా దాస్.. లైలా అంటూ వచ్చేస్తున్న విశ్వక్ సేన్

  • Published Jul 03, 2024 | 11:21 AM Updated Updated Jul 03, 2024 | 11:21 AM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ నటించబోతున్న ఓ మూవీలోని ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ నటించబోతున్న ఓ మూవీలోని ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

  • Published Jul 03, 2024 | 11:21 AMUpdated Jul 03, 2024 | 11:21 AM
Viswak Sen: లేడీ గెటప్‌లో మాస్ కా దాస్.. లైలా అంటూ వచ్చేస్తున్న విశ్వక్ సేన్

టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ ప్రతి సారి వినూత్నమైన కథలతో.. ప్రేక్షకులను మెప్పిస్తునే ఉంటాడు. దాదాపు ఇప్పటివరకు విశ్వక్ నటించిన సినిమాలన్నీ కూడా డీసెంట్ టాక్ నే సంపాదించుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయినా గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గామి సినిమా విశ్వక్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా రికార్డు క్రియేట్ చేసింది. దీనితో విశ్వక్ నెక్ట్ ఫిలిమ్స్ మీద అందరికి బాగా అంచనాలు పెరిగిపోయాయి. మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విశ్వక్.. తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తాడా అని అందరూ ఎదురుచూసే క్రమంలో.. విచిత్రమైన గెట్ అప్ తో అందరిని ఆశ్చర్య పరిచాడు విశ్వక్. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ప్రస్తుతం విశ్వక్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న.. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పేరు “లైలా”. ఇక ఇప్పటివరకు విశ్వక్ మాస్ క్యారెక్టర్స్ తోనే దూసుకుపోతుండడంతో.. ఈ సినిమాలో విశ్వక్ ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడా అని అందరికి ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విశ్వక్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. దీనితో ఈ మూవీ పోస్టర్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెట్ అప్ లో నటించనున్నాడని అర్ధమౌతుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా.. ఇలాంటి క్యారెక్టర్ ను విశ్వక్ ఎంచుకున్నందుకు.. అందరూ విశ్వక్ ను ప్రశంసిస్తున్నారు. అలాగే రివీల్ చేసిన ఫస్ట్ లుక్ లో విశ్వక్ అచ్చం అమ్మాయిల ఉండడంతో.. ఫీమేల్ గెట్ అప్ లో విశ్వక్ లా ఇంకెవరు కనిపించలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Viswaksen Laila

ఇక ఈ సినిమాను లైలా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో విశ్వక్ తో పాటు.. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించనుంది. కాగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఫిబ్రవరి 14 న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు.. ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన ఫస్ట్ లుక్ కే ఈ విధమైన రెస్పాన్స్ వస్తుంటే.. ఇక ఈ సినిమ నుంచి రాబోయే అప్ డేట్స్ ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి లైలా సినిమా నుంచి రిలీజ్ అయినా విశ్వక్ ఫస్ట్ లుక్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş