iDreamPost
android-app
ios-app

బేబీ డైరెక్టర్ కి నో చెప్పడంపై క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్!

  • Author ajaykrishna Updated - 05:36 PM, Mon - 18 December 23

జనరల్ గా హీరోలు కొన్ని సినిమాలను కథలు విన్నాక వద్దనుకున్నా.. అసలు కథ వినకుండా నో చెప్పినా ఆ విషయం ఏదొక రోజు బయటపడక ఉండదు. ఆ కథలు వినిపించిన డైరెక్టర్స్ కావచ్చు..

జనరల్ గా హీరోలు కొన్ని సినిమాలను కథలు విన్నాక వద్దనుకున్నా.. అసలు కథ వినకుండా నో చెప్పినా ఆ విషయం ఏదొక రోజు బయటపడక ఉండదు. ఆ కథలు వినిపించిన డైరెక్టర్స్ కావచ్చు..

  • Author ajaykrishna Updated - 05:36 PM, Mon - 18 December 23
బేబీ డైరెక్టర్ కి నో చెప్పడంపై క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్!

ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అందరూ ఆనందించాలి.. అంతేగాని కించపరచకూడదు అంటున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. జనరల్ గా హీరోలు కొన్ని సినిమాలను కథలు విన్నాక వద్దనుకున్నా.. అసలు కథ వినకుండా నో చెప్పినా ఆ విషయం ఏదొక రోజు బయటపడక ఉండదు. ఆ కథలు వినిపించిన డైరెక్టర్స్ కావచ్చు.. లేదా వేరేవరి ద్వారా అయినా మ్యాటర్ అయితే బయటికి వస్తుంది. ఒకప్పుడు అంటే ఇంత సోషల్ మీడియా.. ఈ టెక్నాలజీ లేదు కాబట్టి.. ఇండస్ట్రీలో జరిగే విషయాలు లేట్ గా అయినా తెలిసేవి.. లేదా అసలు తెలియకపోవచ్చు కూడా. కానీ.. ప్రస్తుతం ఎలాంటి విషయాలైనా వీలైనంత త్వరగా బయటికి వచ్చేస్తున్నాయి.

ఇలాంటి విషయాలు బయటికి వస్తే ఆయా హీరోలు, డైరెక్టర్స్ మధ్య విబేధాలు రావడం గురించి పక్కన పెడితే.. జనాలకు ఓ క్లారిటీ అయితే వస్తుంది. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమా బేబీ. ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిన్న సినిమా.. విడుదల అయ్యాక ఊహించని హిట్ అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగాను బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తోంది. ఇప్పటికి రిలీజై రెండు వారాలు కావస్తున్నా బేబీ హవా థియేటర్స్ లో కొనసాగుతూనే ఉంది. అయితే.. ఈ సినిమా సక్సెస్ గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. మరోవైపు ఓ హీరో ఈ సినిమా కథను వినడానికి కూడా ఇష్టపడలేదు అని డైరెక్టర్ సాయి రాజేష్, సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ కామెంట్ చేశారు.

ఈ విషయంపై తాజాగా హీరో విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి బేబీ కథ విశ్వక్ దగ్గరికి వెళ్లిందని ఎవరికి తెలీదు. కానీ.. సినిమా పేరు మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు. విశ్వక్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా హిట్ అయితే అందరం సంతోషించాల్సిన విషయం. అంతేగాని కించపరచడం కరెక్ట్ కాదు. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటాం. కొన్నిసార్లు కథ వినడం కుదురుతుంది లేదా కుదరదు. నేను అవతల వ్యక్తి టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని.. గంటసేపు కథ విని నో చెప్పడం కంటే ముందే నో చెప్పడం బెటర్ అని చెప్పాను. అంతేగాని దీనికి కూడా వాళ్లు ఫీల్ అయిపోయారు. అందరిని సాటిస్ఫై చేయడానికి నేను బిర్యాని కాదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో అసలు ఏం జరిగింది అనేది బయటపడింది. సో.. బేబీ కథ వినకుండా రిజెక్ట్ చేసిన హీరో విశ్వక్. మరి విశ్వక్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.