iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే ఇన్నేళ్ల తర్వాత.. మారుతికి గుడి కట్టాల్సిందే

  • Published Oct 08, 2024 | 6:03 PM Updated Updated Oct 08, 2024 | 6:03 PM

Raja Saab Movie: టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు వింటేనే డార్లింగ్ ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు. అయితే గత కొన్నేళ్లుగా వరుసగా ప్రభాస్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలే తీస్తున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్లకు మంచి రొమాంటిక్ యాంగిల్ లో కనిపించబోతున్నాడు.

Raja Saab Movie: టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు వింటేనే డార్లింగ్ ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు. అయితే గత కొన్నేళ్లుగా వరుసగా ప్రభాస్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలే తీస్తున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్లకు మంచి రొమాంటిక్ యాంగిల్ లో కనిపించబోతున్నాడు.

  • Published Oct 08, 2024 | 6:03 PMUpdated Oct 08, 2024 | 6:03 PM
ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే ఇన్నేళ్ల తర్వాత.. మారుతికి గుడి కట్టాల్సిందే

నిజమే ప్రభాస్ చేతిలో కత్తి పట్టినా .. విల్లు ఎక్కి పెట్టినా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. కట్ అవుట్ కు తగిన యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ మధ్య బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసేస్తున్నాడు. మేకర్స్ కూడా సరిగ్గా ఆ పర్సనాలిటీకి తగిన క్యారెక్టర్స్ తో ప్రభాస్ ను తెరపై దింపుతున్నారు. దీనితో రెబలోడి ఊచకోతను డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అందులోను వరుస ప్రాజెక్ట్స్ ను కూడా అనౌన్స్ చేశాడు ప్రభాస్. దాదాపు ఒక నాలుగు ఐదేళ్ల వరకు డార్లింగ్ కు తిరుగు లేదు. సరే అవన్నీ ఓకే.. కానీ ఈ రొటీన్ యాక్షన్ ఎలిమెంట్స్ మధ్యలో.. ఎక్కడో ప్రభాస్ లోని కామెడీ , రొమాన్స్ యాంగిల్ ను మిస్ అవుతున్నారు ప్రేక్షకులు. అది ఇప్పుడు ఇన్నేళ్లకు మారుతి దర్శకత్వంలో వచ్చే మూవీ రూపంలో కనిపించబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మారుతికి గుడి కట్టిన తప్పులేదనిపిస్తుంది.

ఎందుకంటే అసలు ప్రభాస్ అనగానే అందరికి గుర్తొచ్చేది … ఆ హైట్, డ్యాన్స్ , కామెడి యాంగిల్ , మూవీలో ప్రభాస్ రొమాన్స్ యాంగిల్.. ఇలా చాలా ఉన్నాయ్. ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే ప్రాణమైన ఇచ్చేస్తాం అంటారు. మిర్చి , డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ , వర్షం లాంటి సినిమాలలో అయితే.. ప్రభాస్ యాక్టింగ్ ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలు చూసి సగం మంది డార్లింగ్ ఫ్యాన్స్ అయ్యారన్నది వాస్తవం . ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయిన మాట నిజమే. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేస్తున్నాడు. వచ్చిన ప్రతి మూవీని ఫ్యాన్స్ కూడా సూపర్ సక్సెస్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అందు ప్రభాస్ ఫ్యాన్స్ వేరయా అనే రేంజ్ లో.. కొత్త మూవీ అప్డేట్స్ ను కూడా ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. ఇంతా చేస్తున్నా కానీ ఎక్కడో వారిలో వింటేజ్ ప్రభాస్ ను మిస్ అవుతున్న ఫీల్ మాత్రం అలానే ఉంది.

దీనితో ఇప్పడు ఇన్నేళ్ల తరువాత మారుతి కాంబినేషన్ లో వస్తున్న.. రాజాసాబ్ సినిమాతో ఆ కోరిక నెరవేరబోతోంది. అటు ప్రభాస్ కూడా కల్కి తర్వాత.. కంప్లీట్ ఫోకస్ రాజాసాబ్ పైనే పెట్టాడు. హార్రర్ రొమాంటిక్ కామెడి జోనర్ లో రాబోతున్న ఈ సినిమాపై.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దానికంటే.. ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు.. అనే విషయం మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రివీల్ అయినా ప్రభాస్ లుక్స్ చూసి.. ప్రభాస్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్రభాస్ ను ఇలా దర్శనం చేసుకుని చాలా ఏళ్ళు అయింది కదా మరీ.. ఈ మాత్రం హైప్ ఉండాల్సిందే. ఇక తెరపై బొమ్మ పడ్డాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి మారుతి అందరూ మిస్ అయినా వింటేజ్ ప్రభాస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. సినిమాలో హర్రర్ టచ్ కూడా ఉండబోతుందంట.. ఈ యాంగిల్ లో ప్రభాస్ కనిపించడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం మూవీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే మూవీపై వరుస అప్డేట్స్ కూడా ఇవ్వనున్నారు మేకర్స్. మరి మారుతి ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetgrandpashabet