iDreamPost
android-app
ios-app

లేడీ యాంకర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన వింధ్య విశాఖ!

  • Published Apr 24, 2024 | 1:19 PM Updated Updated Apr 24, 2024 | 1:19 PM

Vindhya Ishaka Comments:టెలివిజన్ రంగంలో ఎంతోమంది యాంకర్లుగా కెరీర్ మొదలు పెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కొంతమంది టాప్ రేంజ్ లో కొనసాగుతున్నారు.

Vindhya Ishaka Comments:టెలివిజన్ రంగంలో ఎంతోమంది యాంకర్లుగా కెరీర్ మొదలు పెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కొంతమంది టాప్ రేంజ్ లో కొనసాగుతున్నారు.

  • Published Apr 24, 2024 | 1:19 PMUpdated Apr 24, 2024 | 1:19 PM
లేడీ యాంకర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన వింధ్య విశాఖ!

తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎంతోమంది యాంకర్లు వచ్చారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఆడియన్స్ కి దగ్గరగా కనెక్ట్ అయ్యారు.బుల్లితెరపై వచ్చే ఎన్నో కార్యక్రమాలకు యాంకర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో యాంకర్లదే కీ రోల్ అన్న విషయం తెలిసిందే. ఈవెంట్లు, ప్రమోషన్ ఇంటర్వ్యూలు, సక్సెస్ సెలబ్రేషన్స్ ఇలా ప్రతి ఈవెంట్ లో యాంకర్లుదే హవా. టెలివిజన్ రంగంలో యాంకర్లకు అగ్ర పీఠం ఉంటుంది. ఇటీవల కొంతమంది యాంకర్లు అతిగా ప్రవర్తిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా లేడీ యాంకర్లపై తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది యాంకర్ వింద్య విశాఖ. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు బుల్లితెరపై యాంకర్ల హవా కొనసాగుతుంది. తెలుగు యాంకర్లు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది సుమ కనకాల, ఝాన్సీ, ఉదయభాను, శ్యామల, మంజూష. వీరి తర్వాత ఇటీవల బాగా పాపులర్ అయిన వారిలో యాంకర్ అనసూయ, రష్మి, శ్రీముఖి, వింద్య విశాఖ. ఇటీవల కొంతమంది యాంకర్లు బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై సత్తా చాటుతున్నారు. యాంకర్ అనసూయ, రష్మి, శ్రీముఖి సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. అందరు యాంకర్ల ఒక లెక్క అయితే.. యాంకర్ వింద్య విశాఖది మరో లెక్క. తెలుగు లో స్పోర్ట్స్ యాంకర్ తన సత్తా చాటుతుంది. ఐపీఎల్ మ్యాచ్, కబడ్డీ లీగ్స్ కి ఈ అమ్మడు యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా వింద్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. కొంతమంది యాంకర్లపై సంచలన కామెంట్స్ చేశారు. అయితే వింద్య కొంతమంది యాంకర్లను టార్గెట్ చేసే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా అన్న విషయంపై బుల్లితెర అభిమానులు చర్చించుకుంటున్నారు.

యాంకర్ వింద్య విశాఖ మాట్లాడుతూ.. ‘ సుమ అక్క అంటే నాకు ఎంతో ఇష్టం.. ఆమె యాంకరింగ్ చాలా అద్భుంగా ఉంటుంది.ఆమె టైమింగ్ చాలా బాగుంటుంది. ఉదయభాను.. చాలా కాలంగా యంకర్ గా పని చేస్తున్నా.. ఆమె గ్లామర్, లుక్స్ చాలా అద్భుతంగా మెయింటేన్ చేస్తుంది. ఇక ఝాన్సీ అక్కకు సమాజం పట్ల ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆమెతో కొద్దిసేపు మాట్లాడితే చాలు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది యాంకర్లు ఉన్నారు.. బాబోయ్ వాళ్ల ఓవర్ యాక్షన్ చూస్తంటే భయమేస్తుంది. భాషపై పట్టు ఉండదు, యాంకరింగ్ గురించి అవగాహన ఉండదు. కొన్ని షోలకు బూతులు, డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే యాంకరింగ్ ని బ్రష్టు పట్టిస్తున్నారు. మరి వింద్య ఎవరిని దృష్టిలో ఉంచుకొని కామెంట్స్ చేసిందో తెలియదు కానీ.. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş