iDreamPost
android-app
ios-app

విక్రమ్ ‘తంగాలన్’..రిలీజ్ డేట్ వచ్చేసింది! ఎప్పుడంటే..

  • Published Jul 20, 2024 | 11:03 AM Updated Updated Jul 20, 2024 | 11:03 AM

Thangalaan Release Date: విక్రమ్, స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ‘తంగలాన్’. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

Thangalaan Release Date: విక్రమ్, స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ‘తంగలాన్’. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

  • Published Jul 20, 2024 | 11:03 AMUpdated Jul 20, 2024 | 11:03 AM
విక్రమ్ ‘తంగాలన్’..రిలీజ్ డేట్ వచ్చేసింది! ఎప్పుడంటే..

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో  విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. కెరీర్ ప్రారంభం నుంచే  ఆయన విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించేవాడు. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి కల్ట్ క్లాసికల్ మూవీలతో ఆడియన్స్ లో తనదైన మార్క్ ను వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘తంగలాన్’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన డేట్ గురించి స్పష్టత లేదు. తాజాగా ఈ సినిమా విడుదల డేట్ వచ్చేసింది. మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్   చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

విక్రమ్, స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ‘తంగలాన్’. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ వర్డల్ వైడ్ గా తెరకెక్కనుంది.  ఇటీవలే  ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజై ఎంతో ఆకట్టుకుంది. ఇక ఈ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు సినిమా అంచనాలు పెంచాయి. ఇక పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్‌‌’ తెరకెక్కనుంది.

ఈ నేపథ్యంలోనే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని విక్రమ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎద రు చూస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి తరుచు ఏదో న్యూస్ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ‘తంగలాన్’ రిలీడ్ డేట్ గురించి అనౌన్స్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగ‌‌ష్టు 15న విడుద‌‌ల చేయ‌‌బోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.  వాస్తవానికి  జనవరి 26నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ అనుకోని కారణాలతో విడుదల ఆలస్యమైంది. ఈ సినిమాలో విక్రమకు జోడీగా పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ నటిస్తున్నారు‌.

కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కోలార్‌‌‌‌ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌‌ కుమార్‌‌ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే.. ఆగష్టు 15న తంగలాన్ మరో కొన్ని సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది. ఇదే పంద్రాగస్టుకు టాలీవుడ్ నుంచి ‘డబుల్ ఇస్మార్ట్‌‌’ వస్తుంది. అలానే, బాలీవుడ్‌‌ నుంచి ‘స్త్రీ-2’ విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో ‘తంగలాన్‌‌’ పోటీ పడబోతోంది.

Jojobet GirişJojobetAnkara EscortGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibom