iDreamPost
android-app
ios-app

విచిత్ర వివాదంలో వెలుగులోకి విజయ్‌కాంత్‌ పేరు!

  • Published Nov 23, 2023 | 11:54 AM Updated Updated Nov 23, 2023 | 11:54 AM

తమిళ నటి విచిత్ర ఓ తెలుగు నటుడిపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదంలో స్టార్‌ హీరో విజయ్‌కాంత్‌ పేరు కూడా వెలుగులోకి వచ్చింది..

తమిళ నటి విచిత్ర ఓ తెలుగు నటుడిపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదంలో స్టార్‌ హీరో విజయ్‌కాంత్‌ పేరు కూడా వెలుగులోకి వచ్చింది..

  • Published Nov 23, 2023 | 11:54 AMUpdated Nov 23, 2023 | 11:54 AM
విచిత్ర వివాదంలో వెలుగులోకి విజయ్‌కాంత్‌ పేరు!

ప్రముఖ తమిళ నటి విచిత్ర వ్యాఖ్యలు సౌత్‌ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగునాట ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళ బిగ్‌బాస్‌ 7లో కంటెస్టెంట్‌గా ఉన్న ఆమె ఓ తెలుగు నటుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2001లో వచ్చిన ‘భలే వాడివి బాసు’ సినిమా టైంలో ఓ నటుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను షూటింగ్‌ స్పాట్‌ దగ్గరకు వెళ్లగానే ఆ నటుడు నన్ను నేరుగా గదికి రమ్మన్నాడు. నేను రానని అనటంతో నాపై కోపం పెంచుకున్నాడు. ప్రతీరోజు రాత్రి నా గది తలుపులు కొట్టేవాడు.

ఓ రోజు అడవిలో షూటింగ్‌ జరుగుతూ ఉండగా నన్ను అసభ్యంగా తాకాడు. అప్పుడే నా జీవితంలో మొదటి సారి క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను ఎదుర్కొన్నాను. తర్వాత నేను సినిమాలకు గుడ్‌ బై చెప్పాను’’ అని అన్నారు. ఆ నటుడు ఎవ్వరో బయటకు రాకపోయినా.. ఓ స్టార్‌ హీరో పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు విచిత్ర వివాదంలో మరో హీరో పేరు బయటకు వచ్చింది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌కాంత్‌ కూడా వివాదంలో భాగం అయ్యారు.

విచిత్ర వేధింపులకు గురైన సమయంలో ఆయన నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. 2000-2006 వరకు ఆయన నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. విచిత్ర వేధింపుల విషయమై విజయ్‌కాంత్‌ను కలిసిందట. ఆయనకు తన సమస్య చెప్పుకుందట. సదరు నటుడు తనను వేధించాడని అందట. అయితే, దీనికి విజయ్‌కాంత్‌ పాజిటివ్‌గా స్పందించలేదట. తన దగ్గరకు ఎందుకు వచ్చారని, పోలీసుల దగ్గరకు వెళ్లాల్సిందని మండిపడ్డారట.

జరిగిన విషయాన్ని మర్చిపోయి పని చేసుకోవల్సిందిగా ఆయన సలహా ఇచ్చారంట. ఇక, చేసేది ఏమీ లేక తాను సినిమాలనుంచి తప్పుకున్నానని విచిత్ర తెలిపారు. అయితే, విచిత్ర ఫిర్యాదు చేసింది విజయ్‌కాంత్‌కేనన్న క్లారిటీ లేదు. ఆమె వేధింపులకు గురైన సమయంలో నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్నది విజయ్‌కాంతే కాబట్టి.. ఆయనకే ఫిర్యాదు చేసి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కాగా, మన్సూర్‌ అలీ ఖాన్‌ త్రిషపై చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే ఈ వివాదం నెలకొంది.

లియో సినిమాలో త్రిషతో రేప్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నానంటూ మన్సూర్‌ అసభ్యంగా మాట్లాడారు. గతంలో త్రిష గురించి కూడా ఆయన అసభ్యంగా మాట్లాడు. జైలర్‌ సినిమాలో ఆమె దారుణంగా డ్యాన్స్‌ చేసిందని అన్నారు. ఇక, ఈ వ్యాఖ్యలపై తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు. మన్సూర్‌పై ఆగ్రహం​ వ్యక్తం చేస్తున్నారు. మరి, విచిత్ర వివాదంలో విజయ్‌కాంత్‌ పేరు తెరపైకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş