iDreamPost
android-app
ios-app

స్నేహితుడు మూవీలో చేసిన మిల్లీమీటర్ గుర్తున్నాడా.. ఇప్పుడెలా మారిపోయాడంటే?

  • Published Aug 15, 2024 | 7:09 PM Updated Updated Aug 15, 2024 | 7:09 PM

Vijay Dalapathi, Snehithudu Movie: కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, విజయ్ దళపతి కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మిల్లీమీటర్ గుర్తున్నాడా..? ఇప్పుడెలా మారిపోయాడంటే.

Vijay Dalapathi, Snehithudu Movie: కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, విజయ్ దళపతి కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మిల్లీమీటర్ గుర్తున్నాడా..? ఇప్పుడెలా మారిపోయాడంటే.

  • Published Aug 15, 2024 | 7:09 PMUpdated Aug 15, 2024 | 7:09 PM
స్నేహితుడు మూవీలో చేసిన మిల్లీమీటర్  గుర్తున్నాడా.. ఇప్పుడెలా మారిపోయాడంటే?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వెలిగే చాలామంది యాక్టర్స్ ముందు బాల నటులుగానే వెండితెరకు పరిచయమవుతుంటారు. ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే ఏకంగా స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంటారు. ఇలా నటించి గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్స్ మధ్యలో ఏదో కారణంతో నటనకు గుడ్ బై చెప్పడం లేక బ్రేక్ వంటివి చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, హీరోలుగా వెండితెరపై మెరుస్తుంటారు. కాగా, ఇప్పటికే ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్స్ రీ ఎంట్రీ ఇస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే.. అలా ఎంట్రీ ఇచ్చిన వారిని ప్రేక్షకులు గుర్తుపట్టాడం కాస్త కష్టంగానే ఉంటుంది. మరీ, అలా వెండితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు ప్రేక్షకులు గుర్తుపట్టాలేని నటుడిగా మారిన ఓ యాక్టర్ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మరీ, ఆ నటుడు ఎవరో కాదు..’రిన్సన్ సైమన్’

ఈ పేరుతో పెద్దగా ఎవరికి పరిచయం లేదు కానీ, దలపతి విజయ్ నటించిన ‘స్నేహితుడు'(నన్బన్) మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మిల్లీమీటర్ అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమాలో రిన్సన్ ఫన్నీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇకపోతే.. ఈ సినిమాలో నటించిన మిల్లీమీటర్ కాస్త ఇప్పుడు సెంటీ మీటర్ గా మారిపోయాడు. అనగా.. ఇప్పుడు పెద్దయ్యి ఎవరు గుర్తుపట్టాలేనంతగా స్మార్ట్ గా తయారైయ్యాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. చెన్నైలోని ఆగష్టు 4, 1995న జన్మించాడు. ఇకపోతే ఈయన చిన్నప్పటి నుంచి ఓ డ్యాన్సర్ కావడం గమన్హారం. ఈ క్రమంలోనే రిన్సన్ చిన్నప్పటి నుంచి లిటిల్ మాస్టర్స్, డ్యాన్స్ రియాలిటీ షో జోడి నంబర్ 1 సీజన్ 5 వంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి గుర్తుంపు తెచ్చుకన్నాడు. అంతేకాకుండా.. ఈ నటుడు విజయ్ టీవీ ఛానెల్‌లో మాజీ డ్యాన్సర్.

Do you remember the millimeter done in the movie friend

ఇదిలా ఉంటే.. రిన్సన్ కు చిన్నప్పటి నుంచి నటనపై చాలా ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే.. ఓ వైపు డ్యాన్స్ తో పాటు మరోవైపు వెండితెరప నటించాడానికి అవకాశాల కోసం ట్రై చేసేవాడు. ఈ నేపథ్యంలోనే.. 2008లోని తమిళ్ మూవీ అయిన ‘కళై’తో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక ఆ సినిమాలో కుట్టి పిసాసే అనే పాటలో గ్రూప్ డ్యాన్సర్‌గా కనిపించాడు. ఇక ఈ సినిమా తర్వాత.. సిలంబరసన్’, ‘వేదిక’, సంగీత క్రిష్, ‘సీమ’, ‘సంతానం’ వంటి సినిమాల్లో నటించి రిన్సన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే.. 2012లో రిన్సన్ కు శంకర్, విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్నేహితుడు మూవీలో మిల్లీమీటర్ అనే పాత్రకు అవకాశం వచ్చింది. కాగా,ఈ సినిమాలో నటించి రిన్సన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా.. ఈ సినిమాతో రిన్సన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

దీంతో కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్ రిన్సన్ ఆ తర్వాత..2013లో సుత్తా కధైలో కనిపించాడు.  మధ్యలో అవకాశాలు తగ్గిన రిన్సన్ కు ఆ తర్వాత.. 2014లో ఎండ్రెండ్రమ్ నటించాడు. దీని తర్వాత అదే ఏడాది నలనుం నందినియుమ్ అనే సినిమాలో మెరిశాడు. ఇలా పలు సినిమాల్లో అలరించిన రిన్సన్ కు క్రమంగా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇటీవల కాలంలో రిన్సన్ ఏ సినిమాలో కనిపించలేదు. ఇకపోతే ఈయన చివరిగా ధనుష్ దర్శకత్వం వహించిన పాండి చిత్రంలో మాత్రమే కనిపించాడు. ఇకపోతే ప్రస్తుతం రిన్సన్ లేటెస్ట్ ఫిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒకప్పుడు స్నేహితుడు సినిమాలో మీసాలు, గడ్డం లేకుండా కనిపించిన రిన్సస్ ఇప్పుడు మాత్రం గెడ్డం, మీసాలతో గుర్తపట్టాలేని లుక్ తో దర్శనమిస్తున్నాడు. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్నేహితుడు చైల్డ్ ఆర్టిస్ట్ రిన్సన్ లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/