iDreamPost
android-app
ios-app

‘లియో’ డే 2 కలెక్షన్స్.. విజయ్ ఊచకోత కాస్త తగ్గిందనుకుంటా!

  • Author Soma Sekhar Published - 02:17 PM, Sat - 21 October 23

టాక్ తో సంబంధం లేకుండా లియో తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండో రోజుకు వచ్చే సరికి లియో కాస్త అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు.

టాక్ తో సంబంధం లేకుండా లియో తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండో రోజుకు వచ్చే సరికి లియో కాస్త అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు.

  • Author Soma Sekhar Published - 02:17 PM, Sat - 21 October 23
‘లియో’ డే 2 కలెక్షన్స్.. విజయ్ ఊచకోత కాస్త తగ్గిందనుకుంటా!

దళపతి విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం’లియో’. ఇక ఈ సినిమా షూటింగ్ మెుదలైనప్పటి నుంచే భారీ హైప్ ను క్రియేట్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ మూవీ అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా లియో తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండో రోజుకు వచ్చే సరికి లియో కాస్త అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. మరి రెండో రోజు దళపతి విజయ్ ఎంత వసూల్ చేశాడో ఇప్పుడు చూద్దాం.

‘లియో’ తొలి రోజు వరల్డ్ వైగా రూ. 140 కోట్లకు పైగా కొల్లగొట్టిన దళపతి విజయ్.. రెండో రోజున అదే జోరును చూపించలేకపోయాడు. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం దూసుకెళ్తోంది. రెండో రోజు లియో వసూళ్లకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ట్రేడ్ వర్గాల ప్రకారం లియో రెండో రోజున రూ. 42.50 కోట్ల గ్రాస్, రూ. 36 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయట. ఈ లెక్కన చూసుకుంటే.. తొలి రోజు కంటే భారీగానే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని తెలుస్తోంది.

ఇక ఏరియాల వారిగా కలెక్షన్స్ చూసుకుంటే.. తమిళనాడు- రూ.24 కోట్ల, ఆంధ్రా-తెలంగాణ-6 కోట్లు, కేరళ-రూ.6 కోట్లు, కర్ణాటక-రూ. 4.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇండియాలో మెుత్తంగా లియో వంద కోట్ల మార్క్ ను చేరుకున్నట్లు అయ్యింది. ఇదిలా ఉండగా.. తెలుగులో లియో హిట్ అవ్వాలంటే.. రూ. 17 కోట్లు కొల్లగొట్టాలి. ప్రస్తుతం రెండు రోజుల్లో ఈ చిత్రం రూ. 11 కోట్లు వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ మూవీ హిట్ కావాలంటే మరో 6 కోట్లు రాబట్టాలి విజయ్. కాగా.. రాబోయే రెండు రోజులు పండగ కాబట్టి.. లియో క్లీన్ హిట్ గా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు సినీ పండితులు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss