iDreamPost
android-app
ios-app

ప్రముఖ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న ‘విజిల్’ నటి!

  • Published Mar 25, 2024 | 9:59 AM Updated Updated Mar 25, 2024 | 9:59 AM

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి నటించిన విజిల్ మూవీ అందరికి గుర్తే ఉండుంటుంది. ఈ సినిమాలో పుడ్ బాల్ ప్లేయర్స్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ నటి తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి నటించిన విజిల్ మూవీ అందరికి గుర్తే ఉండుంటుంది. ఈ సినిమాలో పుడ్ బాల్ ప్లేయర్స్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ నటి తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

  • Published Mar 25, 2024 | 9:59 AMUpdated Mar 25, 2024 | 9:59 AM
ప్రముఖ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న ‘విజిల్’ నటి!

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి నటించిన ‘విజిల్’ మూవీ అందరికి గుర్తే ఉండుంటుంది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు అట్లీ తెరకెక్కించారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీని అటు తమిళ్ లో ‘బిగిల్’ అని తెలుగులో విజిల్ అనే టైటిల్ తో 2019 ఆక్టోబర్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు.ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పటిలో మంచి సూపర్ సక్సెస్ గా నిలిచింది. అంతేకాకుండా.. ఈ సినిమాలో నటించిన ప్రతిఒక్క క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో పుడ్ బాల్ ప్లేయర్స్ గా నటించిన ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓ నటి తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇంతకి ఆమె ఎవరంటే..

దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఫుడ్ ప్లేయర్స్ గా నటించిన వారిలో  ‘అమృత అయ్యారు’, ‘వర్ష బొల్లమ్మ’ ఒకరు. ఇక ఆ జట్టులో పాండియమ్మ అనే మరొక పాత్ర ఆడియాన్స్ ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఎందుకంటే.. అందులో కామెడీ టైమింగ్‏తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ నటి పేరు ‘ఇంద్రజ శంకర్’. ఈమె విజిల్ సినిమా తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. అయితే ఇన్నాళ్లుగా సినిమాల్లో తనదైన కామెడీతో అలరించిన ఇంద్రజ శంకర్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఇంద్రజ తన స్నేహితుతడు డైరెక్టర్ కార్తీక్‏ను నిన్న అనగా (ఆదివారం మార్చి 24న) చెన్నైలో వివాహం చేసుకుంది.కాగా, వీరి వాహనికి ఇరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఆ దేవుడి ఆశీస్సుతల్లతో పెద్ద సమక్షంలో మనం ఒక్కటయ్యాం అంటూ తమ పెళ్లి ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోస్, వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Bigil Actress

అయితే ఇంద్రజ, కార్తీక్ చాలాకాలంగా ప్రేమంచికుంటున్నారని గతంలో ఇంద్రజ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇక అమ్మా నాన్న కంటే ఎక్కువగా తనకు ఎల్లప్పుడు సపోర్ట్ చేసే వ్యక్తి కార్తీక్ అని.. అతడు మామన్ ట్రస్ట్ కూడా నడుపుతున్నాడని, అందులో నలభై మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడని తెలిపింది. ఇక ముందుగా తనే ప్రపోజ్ చేశానని.. ఆ తర్వాత నాలుగు నెలలకు కార్తీక్ తన ప్రేమను అంగీకరించారని చెప్పుకొచ్చింది. కాగా, వారంలోనే తమ ప్రేమను ఇంట్లో చెప్పి ఖాయం చేసుకున్నమని తెలిపింది. అయితే ఇంద్రజ ప్రస్తుత వయసు 20 ఏళ్లు. ఈమె 2003 మే 17న పుట్టింది. మరి ఇంద్రజ వయసు 20 ఏళ్లు అని తెలియడంతో ఆమె అభిమానులు షాకవుతున్నారు. ఇక ఇంద్రజ తండ్రి కూడా నటుడే కావడం విశేషం. కాగా, ఆయన రోబో డ్యాన్స్ తో ఫేమస్ కావడంతో.. అతడిని అందరూ రోబో శంకర్ అని పిలుస్తారు. మరి, సినిమాల్లో కామెడితో అలరించిన ఇంద్రజ వివాహ బంధంలో అడుగుపెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş