iDreamPost
android-app
ios-app

విజయ్‌ సేతుపతి మంచి మనసు.. చనిపోయిన ఆ స్టార్‌ డైరెక్టర్‌ కోసం..

  • Published Jul 08, 2023 | 6:21 PM Updated Updated Jul 08, 2023 | 6:21 PM
  • Published Jul 08, 2023 | 6:21 PMUpdated Jul 08, 2023 | 6:21 PM
విజయ్‌ సేతుపతి మంచి మనసు.. చనిపోయిన ఆ స్టార్‌ డైరెక్టర్‌ కోసం..

చిత్ర పరిశ్రమలో మంచి మనసున్న హీరోల్లో విజయ్‌ సేతుపతి ఒకరు. సేవా కార్యక్రమాల విషయంలో.. నా అనుకున్న వాళ్లను ప్రేమించే విషయంలో విజయ్‌ సేతుపతి ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా తనతో పాటు పని చేసిన నటీ,నటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌ విషయంలోనూ విజయ్‌ ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఆఖరికి అభిమానులు ఏదైనా ఫంక్షన్‌కు పిలిచినా వారి మనసు కష్టపెట్టొదన్న ఇదితో ఫంక్షన్లకు వెళుతూ ఉంటారు. ఈ మంచి తనమే ఆయన్ని అందరిలో భిన్నమైన వ్యక్తిగా.. గొప్ప వ్యక్తిగా మార్చేసింది.

విజయ్‌ సేతుపతి మంచి తనానికి ఉదాహరణగా నిలిచే ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. విజయ్‌ సేతుపతి ప్రముఖ దివంగత దర్శకుడు కేవీ ఆనంద్‌తో కలిసి గతంలో ‘ కవన్‌’ అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా సమయంలో కేవీ ఆనంద్‌ కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకోలేక 2021 ఏప్రిల్‌ నెలలో ఆయన మరణించారు. కేవీ ఆనంద్‌ మరణించి ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. తాజాగా, ఆయన కూతురు పెళ్లి జరిగింది.

 ఆ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ హాజరు కాకపోవటం గమనార్హం. ఆయనతో సినిమాలు చేసి హిట్లు అందుకున్న వారు కూడా పెళ్లికి పోకపోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే, విజయ్‌ సేతుపతి కేవీ ఆనంద్‌ కూతురి పెళ్లి రిసెప్చన్‌కు వెళ్లారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇక, ఇండస్ట్రీ నుంచి దిగ్గజ డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌ కూతురి పెళ్లి వేడుకకు వెళ్లింది విజయ్‌ సేతుపతి ఒక్కడే కావటం విశేషం. దీంతో విజయ్‌ సేతుపతిపై ఆయన అభిమానులతో పాటు.. సగటు సినీ ప్రేక్షకుడు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి, విజయ్‌ దివంగత డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌ కూతురి పెళ్లి రిసెప్చన్‌కు వెళ్లటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş