iDreamPost
android-app
ios-app

Vijay Deverakonda: రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ రగ్గుడ్ లుక్ అదిరింది!

  • Published Aug 02, 2024 | 12:30 PM Updated Updated Aug 02, 2024 | 12:30 PM

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ మూవీ తెరకెక్కతున్న సంగతి విదితమే. VD 12 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ మూవీ తెరకెక్కతున్న సంగతి విదితమే. VD 12 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.

  • Published Aug 02, 2024 | 12:30 PMUpdated Aug 02, 2024 | 12:30 PM
Vijay Deverakonda: రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ రగ్గుడ్ లుక్ అదిరింది!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో డిఫరెంట్ ఫ్యాన్ జోన్ ఉన్న నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో అమర ప్రేమికుడిగా, పెళ్లి చూపుల్లో పొరుగింటి అబ్బాయిగా, గీత గోవిందంలో ఫ్యామిలీ మెన్‌గా అలరించి ఆకట్టుకున్నాడు. ఈ మూడు చిత్రాలు అతడ్ని నేషనల్ క్రష్‌ను చేశాయి. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం అతడితో యాక్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే కొన్ని రోజుల నుండి తన మార్క్ సక్సెస్ లేక సతమతమౌతున్నాడు ఈ రౌడీ బాయ్. టాక్సీ వాలా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అతని ఖాతాలో పడలేదని చెప్పొచ్చు. కల్కి హిట్ కొట్టినా క్యామియో కావడంతో క్రెడిట్ దక్కలేదు. ఇప్పుడు ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి మూవీపైనే పెట్టుకున్నాడు. VD 12 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ.. మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.

ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుంది. ఇందులో విజయ్ చాలా రగ్గుడ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. చాలా ఎగ్రసీవ్ యాంగిల్ కనిపిస్తుంది. వర్షంలో బిగ్గరగా అరుస్తున్న విజయ్ లుక్ రిలీజ్ చేస్తూ మూవీ విడుదల తేదీని ప్రకటించింది. ఇందులో సరికొత్త లుక్స్‌లో దర్శనమిస్తున్నాడు ఈ యంగ్ స్టార్. అయి ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజును తీసుకుంటున్నారని వార్తలు రాగా, రవితేజ బచ్చన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ భోర్సే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది.

మళ్లీరావా, జెర్సీ వంటి కామ్ చిత్రాలతో హిట్ అందుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. జెర్సీ మూవీకి జాతీయ అవార్డును కూడా కొల్లగొట్టాడు. విజయ్ దేవరకొండతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో సినిమా పోస్టర్ ఎనౌన్స్ చేసే సమయంలో ‘ నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు – అనామక గూఢచారి’ అంటూ మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీని బట్టి చూస్తే పోలీసు గూఢచారి పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.  ఇక ఇప్పటికే ఈ  సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇటీవల శ్రీలంకలో షూటింగ్ పార్ట్ పూర్తి కాగా, లీకు వీరులు విజయ్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేయడంతో నిర్మాణ సంస్థ వెంటనే అప్రమత్తమై… వాటిని తొలగించాలని పేర్కొంది. ఇక పోతే ఈ మూవీ వచ్చే ఏడాది ఉగాదిని టార్గెట్ చేసుకుని మూవీ వస్తున్నట్లు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet