Family Star: ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ.. రౌడీ హీరో హిట్టు కొట్టాడా?

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడిగా.. పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు విడుదలయ్యింది. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలో ప్రేక్షకులు ఏమంటున్నారంటే..

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడిగా.. పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు విడుదలయ్యింది. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలో ప్రేక్షకులు ఏమంటున్నారంటే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఐరనే వంచాలా ఏంటి డైలాగ్ తో అందరి దృష్టిని తన మీదకు తిప్పుకున్నాడు విజయ్. ఫ్యామిలీ మెన్ గా ఉంటూనే ప్రత్యర్థుల భరతం పట్టే పాత్రలో నటించాడని ట్రైలర్ చూస్తే అర్థం అయ్యింది. ఇక పాటలు, టీజర్, ట్రైలర్ లకు మించి ప్రమోషన్స్ నిర్వహించారు నిర్వాహకులు. రౌడీ హీరో సినిమా ప్రమోషన్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాకు కూడా అలానే చేశారు. మూవీ విడుదలకు వారం ముందు నుంచే దీని గురించే చర్చ. ఇక నేడు అనగా ఫిబ్రవరి 5, శుక్రవారం నాడు థియేటర్లలలోకి వచ్చేశాడు ఫ్యామిలీ స్టార్. సినిమా చూసిన ప్రేక్షకులు దీనిపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

మరోసారి విజయ్-పరుశరామ్ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో.. అందరూ గీత గోవిందం రేంజ్ లో ఊహించుకున్నారు. ఇక భారీ అంచనాలతో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందని, ఇంటర్వెల్‌ బ్యాక్‌డ్రాప్‌ అదిరిపోయిందని ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమాలో ఎంటరైన్‌మెంట్‌కు ఏ మాత్రం కొదవ లేదని, ఫైట్స్‌, ఎమెషనల్‌సీన్స్‌తో విజయ్‌ దేవరకొండ ప్రేక్షకులను కట్టిపడేశాడంటూ చాలా మంది ట్వీట్స్‌ చేస్తున్నారు. సినిమాకు ప్రధానంగా విజయ్‌ దేవరకొండ నటన, మ్యూజిక్, మృణాల్‌ ఠాకూర్‌ అందం అభినయం బలమని అంటున్నారు.

Show comments