iDreamPost
android-app
ios-app

కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!

  • Published Sep 21, 2023 | 8:33 PM Updated Updated Sep 21, 2023 | 8:33 PM
  • Published Sep 21, 2023 | 8:33 PMUpdated Sep 21, 2023 | 8:33 PM
కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!

ప్రముఖ హీరో విజయ్‌ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మీరా చావుకు స్పష్టమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. డిప్రెషన్, చదువుల ఒత్తిడి కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, పోలీసుల దర్యాప్తులో మీరా రాసిన సూసైడ్‌ నోట్‌ ఒకటి బయట పడింది. ‘ఐ లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్, స్నేహితులను, టీచర్లను మిస్ అవుతున్నాను. నేను లేకుంటే నా కుటుంబం బాధపడుతుంది’ అని రాసి ఉంది.

అయితే, సూసైడ్‌ నోట్‌లోనూ ఆమె తన చావుకు కారణాలను రాయలేదు. ఇక, మీరా మృతితో విజయ్‌ ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో విజయ్‌ ఆంటోనీ కూతురి మరణంపై ఎమోషనల్‌ లేఖను విడుదల చేశారు. తన ట్విటర్‌ ఖాతాలో దాన్ని పోస్టు చేశారు. అందులో ఈ విధంగా ఉంది.. ‘‘ నా కూతురు మీరా చాలా ధైర్యంగా .. ప్రేమగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషంలాంటివి లేని ఓ మెరుగైన.. ప్రశాంతమైన ప్రపంచానికి తను వెళ్లిపోయింది.

ఆమె నాతో మాట్లాడుతోంది. నేను కూడా ఆమెతో పాటే చనిపోయాను. నేను ఇప్పుడు ఆమెతో సమయం గడుపుతున్నాను. నేను చేయబోయే మంచి పనులన్నీ ఆమె పేరు మీదనే ప్రారంభిస్తాను’’ అని రాసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆయన లేఖను విడుదల చేశారు. ఆ లేఖలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చదువుతున్న నెటిజన్లు విజయ్‌ ఆంటోనీకి తమ సానుభూతి తెలియజేస్తున్నారు. మరి, విజయ్‌ ఆంటోనీ తన కూతురి మరణంపై రాసిన ఎమోషనల్‌ లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş