iDreamPost
android-app
ios-app

పుట్టెడు దుఃఖంలోనూ కుమార్తెతో కలిసి ప్రమోషన్లకు వచ్చిన విజయ్‌

  • Published Sep 29, 2023 | 10:34 AM Updated Updated Sep 29, 2023 | 10:34 AM
  • Published Sep 29, 2023 | 10:34 AMUpdated Sep 29, 2023 | 10:34 AM
పుట్టెడు దుఃఖంలోనూ కుమార్తెతో కలిసి ప్రమోషన్లకు వచ్చిన విజయ్‌

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ నటులు, వారి బంధువుల కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు అభిమానుల్లో సైతం తీవ్ర విషాదం నెలకొంటుంది. ఈ మద్యనే ప్రముఖ నటుడు, దర్శకుడు విజయ్ ఆంటోనీ కూతురు మీరా విజయ్ ఆంటోని ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాద వార్త ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా విజయ్ ఆంటోనీ తన చిన్న కూతురుతో ప్రమోషన్ లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన ఎంతో ఎమోషన్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన 16 ఏళ్ల కూతురు మీరా ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. కూతురు చనిపోవడంతో ఒక్కసారే డిప్రేషన్ లోకి వెళ్లిపోయారు విజయ్ ఆంటోనీ. తన కూతురు పుట్టిన తర్వాతే అన్నీ కలిసి వచ్చాయని.. అలాంటి తన ముద్దుల కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబ సభ్యులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతటి దుఃఖంలోనూ ఆయన తోటి నటీనటుల, దర్శక నిర్మాతల కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

స్టార్ హూదా ఉన్న నటులు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రమోషన్ కోసం చాలా రేర్ గా వస్తుంటారు. హీరోయిన్ల విషయం ఇక ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాంటిది తన కూతురు చనిపోయినా ఆ దుఖాఃన్ని గుండెనిండా దాచుకొని తన సినిమా రిలీజ్ దగ్గరలో ఉండటంతో నిర్మాత, సహనటుల గురించి ఆలోచించిన విజయ్ ఆంటోనీ తన చిన్న కూతురుని వెంటబెట్టుకొని ప్రమోషన్ ఈవెంట్ కి హాజరయ్యారు.

తన గారాల కూతురు చనిపోయిన పదిరోజుల్లోనే విజయ్ ఆంటోని తన గుండె నిర్భరం చేసుకొని.. బాధను దిగమింగుకొని తన ప్రమోషన్ లో పాల్గొనడంపై అందరూ ప్రశంసిస్తున్నారు.తన వ్యక్తిగత సమస్య వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదు అన్న గొప్ప ఉద్దేశం విజయ్ ఆంటోనీకి ఉండటం నిజంగా గ్రేట్ అంటున్నారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ తన చిన్న కూతురుతో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఎస్‌ ఆముదన్‌ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘రత్తం’ మూవీ తెరెక్కుతున్న విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss