Swetha
మిరాయ్ సినిమా వచ్చి ఇప్పటికి రెండు వారాలు అయింది. సినిమా అనుకున్నట్టుగానే అందరిని మెప్పించింది. అయితే ప్రమోషన్స్ టైం లో రిలీజ్ చేసిన వీబీ ఉంది బేబీ సాంగ్ సినిమాలో కట్ చేశారు. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరిగిన సంగతి తెలిసిందే
మిరాయ్ సినిమా వచ్చి ఇప్పటికి రెండు వారాలు అయింది. సినిమా అనుకున్నట్టుగానే అందరిని మెప్పించింది. అయితే ప్రమోషన్స్ టైం లో రిలీజ్ చేసిన వీబీ ఉంది బేబీ సాంగ్ సినిమాలో కట్ చేశారు. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరిగిన సంగతి తెలిసిందే
Swetha
మిరాయ్ సినిమా వచ్చి ఇప్పటికి రెండు వారాలు అయింది. సినిమా అనుకున్నట్టుగానే అందరిని మెప్పించింది. అయితే ప్రమోషన్స్ టైం లో రిలీజ్ చేసిన వీబీ ఉంది బేబీ సాంగ్ సినిమాలో కట్ చేశారు. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. సినిమా రన్ టైం ను , కథనాన్ని దృష్టిలో ఉంచుకుని సాంగ్ ను కట్ చేశారని ఆ సమయంలో అన్నారు. అయినా సరే అది పెద్ద ఇష్యూ కాలేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వసూళ్లు రెట్టింపు అయ్యాయి.
ఓజి రిలీజ్ వరకు ఓపెన్ గ్రౌండ్ దొరికేసింది. ఇక మరో రెండు రోజుల్లో ఓజి రిలీజ్ ఉంది. ఈ సినిమాకు ఇప్పటికే ఉన్న హైప్ గురించి తెలియనిది కాదు. 99% థియేటర్స్ అన్ని ఓజి తోనే ఆక్యుపై అయిపోతాయి. ఈ సమయంలో ఏ సినిమాలు ఉన్నా సరే రేస్ నుంచి తప్పుకోవాల్సిందే. మిరాయ్ కూడా అదే చేస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మిరాయ్ ఆ కట్ చేసిన సాంగ్ ను యాడ్ చేసి మరో సారి యాడ్ చేసి సినిమాను రిలీజ్ చేయనున్నారట. రిపీట్ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా లేక మరేదైనా కారణమా అనేది టీమ్ కే తెలియాలి
అసలే ప్రేక్షకులంతా ఓజి ఫీవర్ లో మునిగితేలుతున్న తరుణంలో మిరాయ్ హడావిడి ఏంటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ఒక్క సాంగ్ కోసం ఆడియన్స్ మరోసారి మిరాయ్ ను థియేటర్లో చూస్తారా లేదా అనేది సస్పెన్స్. ఇలా సాంగ్ యాడ్ చేసిన ప్రింట్ డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేసి ఉంటే కిక్ ఉండేదని మరికొంతమంది అభిప్రాయం. మరి ఆడియన్స్ దీనికి ఓటు వేస్తారా లేదా అనేది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.