iDreamPost
android-app
ios-app

విషాదం: క్యాన్సర్‌తో సీనియర్ నటి కన్నుమూత

  • Published Oct 13, 2023 | 2:43 PM Updated Updated Oct 13, 2023 | 5:13 PM
  • Published Oct 13, 2023 | 2:43 PMUpdated Oct 13, 2023 | 5:13 PM
విషాదం: క్యాన్సర్‌తో  సీనియర్ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మారిముత్తు మరణం మర్చిపోక ముందే, మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత నటి, దర్శక నిర్మాత జయదేవి మరణించారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. మరుసటి రోజు టాలీవుడ్, మాలీవుడ్ నటుడు నాజర్ తండ్రి మోహబూబ్ బాషా తుది శ్వాస విడిచారు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నటి భైరవి వైద్య (67) ఇక లేరన్న వార్త వచ్చింది. ఆమె ఈ నెల 8న మరణించగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భైరవి వైద్య మరణించిన విషయాన్ని ఆమె కుమార్తె జాంకీ వైద్య, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

భైరవి వైద్య గుజరాతీ, హిందీ చిత్రాల్లో నటించారు. ఇటు బుల్లితెరపై కూడా మెరిశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఈ నెల 8న మరణించారు. ఆమె సినీ పరిశ్రమలో సుమారు 45 ఏళ్ల పాటు కొనసాగారు. బాలీవుడ్‌లో అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ మూవీ తాల్, సల్మాన్ తో చోరీ చోరీ చుప్కే చుప్కేలో కీలక పాత్ర పోషించారు. అలాగే బుల్లితెరపై పలు ధారావాహికల్లో కనిపించారు హస్రతీన్, మహిసాగర్ వంటి షోలో పనిచేశారు. ఆమె ఇటీవల నిమా డెంజోంగ్పా అనే టీవీ షోల్లో కనిపించారు. ఆమె గుజరాతీ మూవీ వెంటిలేటర్ తో సహా పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లో కూడా పనిచేశారు. వాట్స్ యువర్ రాషీ, హమ్ రాజ్, క్యా దిల్ నే కహా వంటి చిత్రాల్లో కూడా ఆమె నటించారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş