iDreamPost
android-app
ios-app

అస్వస్థతకు గురైన ప్రముఖ నటుడు మోహన్ లాల్.. ఆస్పత్రిలో చేరిక

  • Published Aug 18, 2024 | 3:24 PM Updated Updated Aug 18, 2024 | 3:31 PM

Actor Mohanlal: ప్రముఖ హీరో మోహన్ లాల్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో మోహన్ లాల్ ను కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

Actor Mohanlal: ప్రముఖ హీరో మోహన్ లాల్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో మోహన్ లాల్ ను కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

  • Published Aug 18, 2024 | 3:24 PMUpdated Aug 18, 2024 | 3:31 PM
అస్వస్థతకు గురైన ప్రముఖ నటుడు మోహన్ లాల్.. ఆస్పత్రిలో చేరిక

సినీ ఇండస్ట్రీలో స్టార్ నటులు, సింగర్స్ అస్వస్థతకు గురవుతున్నారు. నిన్న ప్రముఖ సింగర్ పి సుశీల అనారోగ్యానికి గురవ్వగా ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా స్టార్ నటుడు మోహనల్ లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో మోహన్ లాల్ ను కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రద్దీ ప్రదేశాలతోపాటు షూటింగ్స్ కు కొన్నిరోజులపాటు దూరంగా ఉండాలని మెడికల్ బులెటిన్ రిలీజ్ చేశారు.

Actor Mohanlal 02

అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం మోహన్ లాల్ కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వివిధ భాషల్లో నటిస్తూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు నటుడు మోహన్ లాల్. నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత. 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కాగా మోహన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా పేరు ‘బరోజ్’. ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom