iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8వ సీజన్ లోకి వేణుస్వామి? హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా..!

  • Published Jul 04, 2024 | 4:48 PM Updated Updated Jul 04, 2024 | 4:48 PM

Venu Swamy- Bigg Boss Season 8 Contestants: బుల్లితెర ప్రేక్షకులకు దిమ్మతిరిగే వార్త ఇది. అదేంటంటే.. ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Venu Swamy- Bigg Boss Season 8 Contestants: బుల్లితెర ప్రేక్షకులకు దిమ్మతిరిగే వార్త ఇది. అదేంటంటే.. ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

  • Published Jul 04, 2024 | 4:48 PMUpdated Jul 04, 2024 | 4:48 PM
బిగ్ బాస్ 8వ సీజన్ లోకి వేణుస్వామి? హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు త్వరలోనే బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఎప్పటి నుంచో ఈ షోకి సంబంధించి చాలానే లీకులు వస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ పేర్లు ఇవే అంటూ చాలామంది వైరల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేరాడు. వచ్చే బిగ్ బాస్ సీజన్లో వేణుస్వామి హౌస్ లోకి వస్తున్నాడు అంటూ ఇప్పటి నుంచే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా సహా మీడియా కూడా వేణుస్వామి వచ్చేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అదే గనుక నిజమైతే ఈసారి బిగ్ బాస్ హౌస్ ఓ రేంజ్ లో ఉంటుంది అని కామెంట్స్ వస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 8 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి సీజన్ కి కొంత ప్రాధాన్యత ఉంది. అదేంటంటే.. 7వ సీజన్ సూపర్ సక్సెస్ కావడం మాత్రమే కాకుండా.. ఈసారి సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది అంటున్నారు. వారిలో ప్రముఖంగా వినిపించిన పేరు కుమారీ ఆంటీ. ఆవిడ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యింది. అంతేకాకుండా.. టీవీ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా కనిపించింది. ఆవిడను తీసుకొస్తే కచ్చితంగా ఆడియన్స్ ఎక్కువ ఎంగే అయ్యే అవకాశం ఉంది. మరో పేరు బర్రెలక్క. ఈవిడ ఈ మధ్య ఏం చేసినా తెగ వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే అభ్యర్థిగానే కాకుండా.. ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసింది. అలాగే పెళ్లితో కూడా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు వీళ్లందరినీ మించి వేణు స్వామి పేరు వినిపిస్తోంది.

Venu Swamy into Biggboss

సాధారణంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు రెండు తెలుగు రాష్ట్రాలు సహా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. సెలబ్రిటీలకు జాతకం చెప్పడం, వారితో ప్రత్యేక పూజలు చేయించడంతో వేణు స్వామి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని కొన్ని కామెంట్స్ కూడా ఆయన్ను వార్తల్లో ఉండేలా చేసింది. అయితే ఆయన ఏది అనుకుంటున్నాడో అది మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తాడు. ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే.. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడేస్తాడు. అలాంటప్పుడు కచ్చితంగా కంటెంట్ వస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులకు కావాల్సింది కూడా అదే.

అందుకే వేణుస్వామి కచ్చితంగా హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అలాగే ఆయనకు ఈ సీజన్ లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా దక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే బయట వేణుస్వామి పూజలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు అని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అలాంటప్పుడు ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అంటే కచ్చితంగా అంతకు మించే దక్కాలి. ఒకవేళ ఆయన నిజంగానే వెళ్తే.. ఎలా ఆడతారు? అనేది కూడా ప్రధాన ప్రశ్న. మరి.. బిగ్ బాస్ లోకి వేణుస్వామి అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom