iDreamPost
android-app
ios-app

షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ వరుణ్‌ సందేశ్‌.. ఏం జరిగింది అంటే!

  • Published Jun 22, 2023 | 11:34 AM Updated Updated Jun 22, 2023 | 11:34 AM
  • Published Jun 22, 2023 | 11:34 AMUpdated Jun 22, 2023 | 11:34 AM
షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ వరుణ్‌ సందేశ్‌.. ఏం జరిగింది అంటే!

హ్యాపీడేస్‌ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు వరుణ్‌ సందేశ్‌. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికి.. వరుణ్‌ కెరీర్‌ మాత్రం ఆశించిన మేర సక్సెస్‌ కాలేదు. మధ్యలో కొన్ని చిత్రాలు చేసినా పెద్దగా విజయం సాధించలేదు. ఈ ‍క్రమంలో కొత్త బంగారు లోకం వరుణ్‌ ఖాతాలో చెప్పుకోదగ్గ విజయంగా చెప్పవచ్చు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ అవేవీ ఆశించిన మేర విజయం సాధించలేదు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్నాడు. ఇటీవలే విడుదైన సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ సినిమాలో విలన్‌ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, పలు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా వరుణ్‌ సందేశ్‌ ప్రమాదానికి గురయ్యాడు. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఇంతకు ఏం జరిగింది అంటే..

ప్రస్తుతం వరుణ్‌ సందేశ్‌..‘ది కానిస్టేబుల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్ సీన్‌కు సంబంధించిన షూటింగ్‌ జరుగుతుండగా.. ప్రమాదం చోటు చేసుకుని.. వరుణ్‌ కాలికి గాయమైంది. ఇది గమనించిన వెంటనే చిత్ర బృందం వరుణ్‌ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వరుణ్‌కి చికిత్స అందించిన డాక్టర్లు ప్రమాదం లేదని.. కానీ మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ది కానిస్టేబుల్‌ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మిస్తున్న ‘ది కానిస్టేబుల్’ చిత్రానికి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక కానిస్టేబుల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగా.. ఇప్పుడు సడెన్‌గా వరుణ్‌ సందేశ్‌ కాలికి గాయం కావడంతో షూటింగ్‌ను వాయిదా వేసినట్ల దర్శకుడు వెల్లడించారు. శంకరపల్లి దగ్గరలోని టంగుటూరు గ్రామంలో పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం వరుణ్‌ సందేశ్‌..‘ది కానిస్టేబుల్’తో పాటు ‘యద్భావం తద్భవతి’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు గాయం కారణంగా షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet